20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అణువుల తనువులో కొలువుదీరిన ఆ స్నేహం ...

వేకువజామున ​కను ​పాపల కొలను లో పుట్టిన ఓ స్వప్నం ...
అనిర్వచనీయమైన స్నేహ గంధ పరిమళాన్ని సాక్షాప్తరింపచేసింది...
అది ఒక కమనీయ దృశ్య కావ్యంగా ...తనువు ని తచ్చాడుతూ .. ​
హృదయ సాగరమంచున తలుకులీనిన ఉషోదయ సూర్య కిరణంలా ...
అంతరాల్లో నిక్షిప్తమైన చీకటి తెరలను తెంచుతూ ... తొలగిస్తూ
తొలకరి చినుకులా ఆరంబం అయి ... చినుకు చినుకు కలిసి ..
జడివానలా ... నిత్య ప్రవాహినై ... జీవనది లా మారి..
జన జీవుల ప్రాణాధార అయినట్లు గా ....
సంగీత సామ్రాజ్యంలో మంజీర నాదమై ... సాహిత్య తోటలో వికసించిన కుసుమరాజం లా ...
అణువుల తనువులో కొలువుదీరిన ఆ స్నేహం ...
అజరామరం ...
--
శ్రీనివాస్ కళ్యాణపు
Sep 20th 11.19 PM
Parlin,New Jersey