30, జూన్ 2009, మంగళవారం

" మనస్సు సంఘర్షణ "

ఏదో ఒక భావన..
నర నరాల్లో జీర్ణిచుకుపోయిన సంఘర్షణ ..
కన్నులు ఉండి చూడలేక..కాళ్ళు ఉండి కదలలేక ..
నిత్యం సతమతమౌతున్న ఆవేదన...
గుప్పెడంత గుండెల్లోంచి పొంగుతున్న ఆలాపన..
"ధ్యానం" చేస్తే మనస్సు ప్రశాంతం..
కపటాన్ని మరిస్తే అది హృదయ నిర్మలత్వం ...
ఏదో ఒక దిక్కును నిరంతరం చూస్తూ ఉంటే ..అది పరద్యానం..
వ్యక్తిత్వంతో వ్యవహరిస్తే అది హుందాతనం..
చివరకి దాని వాళ్ళ మంచితనం..
నిన్ను నీవు తెలుసుకుని ...నలుగురితో మెలిగావంటే అది స్నేహం..
నటిస్తూ నమ్మించావు అంటే అది ద్రోహం..
కలిసి ఉండి కలతలు సృష్టించావు అంటే ..వ్యతిరేకం అది మానవతా వాదానికి..
అందుకే .
" భావన "
" ఆవేదన "
" ఆలాపన "
ప్రతి జీవికి ఏదో ఒక రీతిగా ఎదురయ్యే..
" మనస్సు సంఘర్షణ "
--
శ్రీ కళ్యాణపు
Actual Written Date: August 18th 1999. 11.55 am.
Hyderabad.

విశ్వ కళావేదిక..

అది పరిచయాల వేదిక..
అంతరంగాల తరంగాలను ..
మృదంగ నాదాలుగా మలచి..
మౌనంగా ఒకరిని ఒకరు తెలుసుకునే ...యుగారంబ వేదిక..
తడబడు మాటలే పాటలుగా మారి..
క్షణ క్షణాన్ని పరవశంగా మారుస్తున్న చిరునవ్వుల వెలుగుల వేదిక..
వయ్యారాల వగలుపొతూ ...మయూరిలా నర్తిస్తూ ..
మది మదిని దోచుకుంటున్న భూమిక..
నవ వసంతాలు ఒక్కసారిగా ఉప్పొంగిన విశ్వ కళావేదిక...
ఎవరు చెప్పినా..ఎలా చెప్పినా..
ఎక్కడ చెప్పినా ...ఎ విదంగా చెప్పినా..
అన్ని భావాలాపనల అద్భుత భాండాగారం..
చిరు ధరహాసాల చిరునామా..
గుండె గుండెను తాకుతూ ..జ్ఞాపకాల అలలకు ...
తెరలేపిన ...పద గీతికల వేదిక..
" మనస్సు"
అవును అది మనస్సు అనే విశ్వ కళావేదిక..

శ్రీ కళ్యాణపు
Actual Written Date: September 09,2007. 12.33 a m.
పూణే.

ఎక్కడ మొదలైన పరిచయం..

అది ఎక్కడ మొదలైన పరిచయం..
మొదట సందిగ్దం ..తరువాత పలకరింపులు..
క్రమంగా సుగందాల చిరునవ్వుల వాన...
ఆకాశంలో కనిపించే..తారల వెలుగులన్నీ..ఒక్కసారిగా భూమిని తాకితే....!!!
ఆ వెలుగుల తారా జల్లులు ...భూమి అంతటా ...కాంతిరేఖల వ్యవసాయం చేస్తున్నట్లుగా ఉన్నది..
నీ స్నేహం కుడా అటువంటిదే..
నీ దరహాసం ముందర ...ఆ తారల మిల మిల మెరుపులు ..
చాలా సూక్ష్మంగా అనిపించాయి..
సప్తవర్ణాల ఇంద్రధనుస్సులో ఏ వర్ణం లోపించినా కూడా ...
అది ఇంద్రధనుస్సు నిజరూపాన్ని కనుమరుగు చేస్తుంది...
ఎలా చెప్పాలి..ప్రతి అణువులో నువ్వే అని...
ఆ అడుగుల సవ్వడులు ...ఆ చిరునవ్వుల చిరుజల్లులు..
ఆ తొలిమాటల మధుర జ్ఞాపకాలు..ఎన్ని అని చెప్పాలి..
ప్రతిది గుర్తుకు వస్తూ ...అంతరంగంలో అనునిత్యం పరిబ్రమిస్తూనే ఉన్నాయి... అని
---
శ్రీ కళ్యాణపు
Actual Written Date: August 29th ,2007. 10.56 pm.
Kukatpally, Hyderabad.

29, జూన్ 2009, సోమవారం

ఒక నేను...

నిన్ను చూసినప్పుడు నన్ను నేను కోల్పోయాను..
నాతో నీవున్నప్పుడు ...ఈ ప్రపంచాన్ని జయించటం అతి చిన్న విషయం అనిపించింది..
నీ మాటలు చూపులు అన్ని మృదు మధురమే ...
స్వతహాగా నేను ఆశావాదిని..
సమస్యల అలలు నాపై విరుచుకు పడుతున్నా... చిరునవ్వుల ఆనకట్టను కట్టి...
అలజడుల కెరటాలపై పోరాటం చేసి ...మునిగిపోతున్న జీవితాన్ని మరల బృందావనం చేయగలిగా..
నమ్మకం, ఆత్మీయత,విశ్వాసం ,ప్రేమలను పెట్టుబడులుగా పెట్టి..
స్నేహ సౌదాన్ని నిర్మించి ...స్నేహ బంధాన్ని ఆత్మ బంధంగా ఇచ్చినా కూడా ...
నన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు హీనంగా మాట్లాడిన కూడా ..
తొణకని వ్యక్తిత్వంతో నిండుగానే ఉన్నాను..
తిరిగి ఎదురు దాడి చేయకపోవటం నా అసమర్ధత మాత్రం కాదు..
"స్నేహమనే అందమైన పూలతోటలో చిరునవ్వుల జల్లులు తప్ప..
విషాద , కన్నీటి వానలు ఉండకూడదు అన్నదే నా సిద్దాతంతం.."
బహుశా ఇదే అవతలివాళ్ళకి నా బలహీనతగా కనిపించవచ్చు...
ఒక్కసారి మోసపోగలం..కాని జీవితమంతా మోసపోలేముకదా...
ఇన్ని జరిగినా కూడా మనసులో ఎక్కడా నిరాశ లేదు..
బహుశా జీవితంపై నాకున్న నమ్మకం కావొచ్చు..
నా ఆశయాలు..సిద్దాంతాలు ..అన్నీ నీతో చెప్పినప్పుడు..నీవన్న చిన్నమాట నా జీవితాన్నే మార్చివేసింది...
నాకు తెలియకుండా నీపై ఏదో తెలియని అభిమానం..మనస్సు లోతుల్లో ఎక్కడో ఆరంబమైనది...
ఇన్నాళ్ళ స్వేఛ్చ ..స్నేహం..అన్నీ ఇక లేవు అని తెలిసినప్పుడు..
మరో సారి నన్ను నేను కోల్పోయాను..
ఆ చిరునవ్వుల " తీయని నేస్తం" ...
మరల కనిపించని ఆ మధుర స్వప్నం..,పరిచయం..
ఇక ఎప్పటికి కనిపించదేమో..లబించదేమో..
కొన్ని పరిచయాలు కొంతకాలమే ఉన్నా..చిరకాలం పిల్ల తెమ్మెరలా ..
మనస్సును తాకుతూ ఉంటాయి..బహుశా " నీ స్నేహం " అటువంటిదే..!!!
శ్రీ కళ్యాణపు
Actual Written Date:August 27th 2007.11.35 pm.
Kukatpally,Hyderabad.

ఒక పరిచయం...

ఒక పరిచయం...
హృదయంతరాల్లోని భావాలను..
మస్తిస్కంలోని ఆలోచన తరంగాలను ...చల్లని పిల్ల తెమ్మెరలా...
విశాల మైదానంలో విరబూసిన...వెండి వెన్నెలలా..
తడబడుతున్న అడుగులను గమ్యస్తానంవైపు కూర్చుతూ ...
స్థిరత్వం , స్థిమితం ,ఆత్మవిశ్వాసం అనే చిన్ని విత్తనాన్ని నాటి..
ఆదర్శవంతమైన ,ఉన్నతమైన విలువలతో కూడిన ..
పారమార్దిక జీవితమనే..గొప్ప వృక్షాన్ని నాలో నిలిపిన...ఆ పరిచయం..
నిశ్వార్దపు స్వేచ్చా స్రవంతిని ఇచ్చిన... ఆ పరిచయం..
దిన ,దిన ప్రవర్ధమానమై..నిత్య నూతనమై ...
నిరంతం నాలో నిలువెల్లా మరొక నేనై నిలిచిన ఆ పరిచయం..
ఎప్పటికీ... అమరమే....విశ్వ వ్యాప్తమే..

శ్రీ కళ్యాణపు
Actual Written Date:August 22nd 2007 ,11.56 Pm.
Kukatpally , Hyderabad.
( To /For someone who are always unforgettable.....)

స్నేహమా.. నీవెక్కడ..

కొంతమంది మనస్సుకు దగ్గరగా వస్తారు..
అంతే త్వరగా వెళ్ళిపోతారు..
వారిలో కొద్దిమంది మాత్రమే...మనస్సు పొరల్లో చెరగని ముద్ర వేస్తారు ..
ఆ పరిచయ పరిమళాలు నూతన శ్వాశని అందిస్తాయి..
క్రొత్త ఆశయాలకు పునాదులు అవుతాయి..
తరాల అంతరాలను చేరిపివేస్తూ ...
జీవన గమనాన్ని,జీవితపు అడుగులను మార్చివేస్తూ ..
ఉత్తుంగ తరంగాలను తీసుకు వస్తూ దిశా నిర్దేశం చేస్తాయి..
అంతటి విలువైన స్నేహం ..పరిచయం ఎప్పటికి అమృతమయమే...
శ్రీ కళ్యాణపు..
Actual Written date: March 31st 2007, 11.55 pm.
Bangalore.

నిస్వార్దమైన స్నేహం

అది ఏ గుండె గూటిలో ఒదిగిన కావ్యమో..యుగాలనాటి యాగాలను స్ఫురణకు తీసుకు వస్తుంది..
ఏ జ్ఞాపక కుసుమాన్ని మీటినా ఎన్నో ఏళ్ల పరిచయ బంధాన్ని సేలయేరులా ప్రవహింప చేస్తుంది ...
కొన్ని పరిచయాలు నిర్మలమైనవి..నిత్యం మదిలో మెదులుతూ ఉంటాయి...
ఆ అనిర్వచనీయమైన స్నేహం నూతన శ్వాశ నిస్తుంది..
గందర్వ గానంలా మనస్సుకి హత్తుకుంటుంది..
చంధన పరిమళాన్ని వెదజల్లుతుంది ...నిస్వార్దమైన స్నేహం...నిత్యం నూతన శ్వాశ నిస్తుంది..

శ్రీ కళ్యాణపు..
Actual Written Date:14.01.2003, 8 PM
Buckinghamshire,UK.

మనస్సు

సింధూరపు తూర్పు తీరంలో వికసించే భావావాలెన్నో..
సెలయేటి గట్టుపైనుండి వచ్చే వేణుగానం ..
చిన్నవాళ్ళకు జోల పాటగా మారి..చల్లని నిద్రని ఇస్తుంది..
యువతి ,యువకులకు ప్రణయగీతంలా ఉంటుంది ...
మధ్య వయస్కులకు కష్టాల కడగండ్లను ప్రారదోలె తొలకరిలా ఉంటుంది...
వృద్దులకు సంసార సాగరంనుండి బంధ విముక్తులను చేసే..గంధర్వ గానంలా ఉంటుంది..
యోగులకి తప:శక్తిని పెంచే అమృత ధారలా ఉంటుంది..
ఇందరిలో ఇన్ని భావాలను పలికించేది.... " మనస్సు"
శ్రీ కళ్యాణపు..
Actual Written Date : 14.03.2003,8.30 PM
Buckinghamshire, UK.

28, జూన్ 2009, ఆదివారం

మా అమ్మకు..

ప్రపంచంలోని గ్రందాలు అన్ని పటించాను...
ఒక అందమైన పదం దొరుకుతుందేమో అని..
ప్రకృతినంతా వెదికాను ...
ఒక సుందరమైన ప్రదేశం కనిపిస్తుందేమో అని..
మందిరాలు,మసీదులు తిరిగాను..చర్చిలతో సహా..
మానసిక ప్రశాంతత లబిస్తుదేమో అని..
అమ్మ అన్న పదమే అమూల్యమైనది అని..
అమ్మ చుట్టూరా ఉన్న ప్రదేశమే సుందరమైనది అని..
అమ్మ ఒడిలో ఉన్న ప్రశాంతత ..మందిరాలు..మసీదులు..చర్చిల్లో లేదని..
ప్రపంచం అంతా తిరిగాక ,వెతికాకే తెలిసింది..
-----
శ్రీ కళ్యాణపు
Actual Written Date: May 14th 1999. 1PM.
Khammam.

తూర్పు

ప్రతి వేకువన అనుకుంటాను ..తూర్పు దిక్కు ఎంత అదృష్టవంతురాలని ..
అవును మరి.. అదృష్టవంతురాలే కదా..
జీవులు ..నిర్జీవులు అనే తేడాలేకుండా..
అన్నిటిపై తన వెలుగును సమానంగా ప్రసరింపజేసే సూర్యబింబాన్ని ..
తన నుదిటిపై ఎర్రటి కుంకుమలా అలంకరించుకున్న తీర్పు అదృష్టవంతురాలే కదా
అందరిని మేల్కొలిపి ..అందమైన ప్రకృతిని అందరు ఆస్వాదించేలా చేస్తుంది..
తుర్పులోన సింధూరం తిమిరాన్ని ప్రారదోలి ..వెలుగుల చైతన్యాన్ని ఇస్తుంది..
ఎన్ని ఒంపుల సింగారాలో.. ఈ వేకువ తూర్పులో..

శ్రీ కళ్యాణపు
Actual Written Date: 13.11.1999 ,1.40 am.
హైదరాబాద్.

జీవితం

గడిచిన జీవితం మధురమే..
ఎన్నో పరిచయాలు...మజిలీలు..
తీపి గుర్తులు కొన్ని...మరచిపోలేని చేదు జ్ఞాపకాలు మరికొన్ని ...
ఆర్ద్రతతో కూడిన ఆవేదన అనంతమే ...
జీవితం ఒక సాగరం అంటారు...కాని జీవితమంతా సాగరంలా ఉంటే పయనించటానికి నావలు ఎక్కడ ఉంటాయి..
దరి చేరుటకు తీరం ఎక్కడ ఉంటుంది..
ప్రతి మనిషి పరిచయస్తుడు అవ్వగలడు..కాని ప్రతి పరిచయం మల్లెపువ్వు అంత స్వచ్చమైనది కాలేదేమో ...
సందేహాలు ఎన్నో ...సమాధానాలు కొన్నే..
నిరాశ లేదు ..నిస్పృహ లేదు..గర్వం అంతకన్నా లేదు..
అనంతమైన ఆలోచనలు అంతకు మించిన ఆవేదనలు..
ప్రంపంచంలోని బాషలను నేర్వ వచ్చు ..కాని మౌన బాషను నేర్వగలమా ..కేవలం గమనించగలం అంతే..
జీవితాన్ని ఆమూలాగ్రం చదివామంటారు కొందరు..
కాని వారు అంతా గమనించిన వారు మాత్రమే..చదవటానికి అది ఎప్పటికి మారని స్థిరమైన గ్రంధం కాదు కదా..జీవితానికి , మౌనానికి బాష లేదు..కులం లేదు..గోత్రం లేదు..జాతి..మతం అంతకన్నా లేదు..
కేవలం మానవత మాత్రమే ఉన్నది...
మనుషులే దాన్ని మలినం చేస్తున్నారు..
జీవితం మనిషికి మాత్రమే ఉండదు...మట్టికి ..మానుకి ..రాయికి ఉంటుంది ...
ఇంకా చెప్పాలి అంటే ప్రతి అణువుకి ఉంటుంది ...
దానికి రూపం లేదు..బావం లేదు.. కాని ఆదర్శం ఉన్నది ...
అందుకే జీవితాన్ని చదివాము అన్నవారంతా ...కేవలం గమనించిన వారు మాత్రమే అని నా భావన ...
అందుకేనేమో గడిచిన జీవితం కొంత కటినమైనది అయినా.. కొన్నిసార్లు మధురంగా అనిపిస్తుంది....
శ్రీ కళ్యాణపు..
Actual Written Date : 08.11.1999,

OU Campus , Hyderabad.

పరిచయం

ప్రతి పరిచయం ఒక సుమధుర జ్ఞాపకమే....
గతాన్ని మీటితే ఎన్నోగుండెచప్పుళ్ళు..
ఎ పరిచయ ప్రమానమో అది ..
హృదయాంతరాల్లో గూడుకట్టుకున్న వాస్తవాన్ని పరిమళం చేసింది..
వెన్నెల్లో పొన్నాయి చెట్టుకి చెప్పిన ఊసులకి జాబిల్లే మౌనసాక్షి..
ఆకాశ హార్మ్యం నుండి ఎదను తాకిన మంచుముత్యాల స్పర్శ ..
ఒక్కసారిగా మనసుపుటల్లోని మౌనరాగాన్ని చీల్చివేసింది ...
యుగాలమద్య ఉన్న అగాదాన్ని ఒక్కసారిగా తరిమివేసింది..
ఆ తీయని " స్నేహం.." ...
శ్రీ కళ్యాణపు
Actual Written Date: 22.08.2002 ,12 am.
Manchester,UK

ఓ తీయని స్నేహమా...

ఓ తీయని స్నేహమా...
ఆకాశపు అంచుల దాకా తీసుకెల్లి...
వెన్నెల కిరణాల సాక్షిగా...
నక్షత్ర మండలం లో ఆత్మీయతా,ఆనురాగాలను పరిచయం చేసి...
అనుక్షణం అంతరంగాలలో..తీయని ఙ్ఞాపకంలా మెదులుతూ...
ఒంటరినై ఉన్నప్పుడు ...
నీ మధుర ఙ్ఞాపకాలను తోడుగా పంపి...
సిరిమల్లెల సాంగత్యంలా విశ్వ వ్యాప్తమై.....
అనువనువునా...నిక్షిప్తమై...
నన్ను నన్నుగా గుర్తించిన ఓ ధివ్య ఫరిమలమా....
ఎప్పటికీ......నాతో ఉండిపో...........
శ్రీనివాస్ కళ్యాణపు.....

27, జూన్ 2009, శనివారం

sweet Remembrance...

అలలా ఎగసి పడుతూ ఎదను మీటుతున్న జ్ఞాపకం ...
ఒంటరిగా ఉన్నవాన్ని బందాలలోకి నెట్టిన జ్ఞాపకం ...
స్పష్టత లేదు... స్వరూపం లేదు..ఏ ఆకారం తెలియని నిరాకారపు జ్ఞాపకం ...
ఆయినా నవనాడుల స్పందనకి ఉవ్వెత్తున ..ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతున్న జ్ఞాపకం...
ఆకలి దప్పులని మాన్పించి ..ఆలోచనా తరంగాలవైపు పయనం చేయిస్తున్న జ్ఞాపకం..
స్థానువైన హృదయానికి స్థానచలం కలిగించిన జ్ఞాపకం...
అంతరంగంలో వేస్తున్న తప్పటడుగుల శబ్దాన్ని ..సిరిమువ్వల సవ్వడులుగా మార్చిన జ్ఞాపకం ...
ఆవసాన దశలో ఉన్న ఆత్మీయతానురాగాలను సుగందలేపనాలతో సుచరితం చేసిన జ్ఞాపకం...
మమతలు మరిచి ..మనిషి మహిషిగా మారుతున్నప్పుడు ..మహోన్నత మానవతారీతులను జ్ఞప్తికి తెచ్చిన జ్ఞాపకం...
పాషాణంగా ఉన్నవానికి పాదచలనం కలిగించిన జ్ఞాపకం ....మనిషిని మనిషిగా చూడటం నేర్పిన జ్ఞాపకం...
ఎప్పటకి చెదరని జ్ఞాపకం ...ఎన్నటికి వీడని జ్ఞాపకం ...
తొలిచూపులో ఎదను తాకిన జ్ఞాపకం...
తుదిశ్వాశవరకు చెరగని జ్ఞాపకం...
రెండు అక్షరాల స్పందనకి ...ప్రతిస్పందనని కలిగించిన జ్ఞాపకం...
......ప్రేమ....
అవును.. అది ప్రేమ అనే తీపి జ్ఞాపకం..
ప్రతి హృదయంలో ...ఏదో ఒకనాడు ఏదో ఒకరీతిగ మెదిలే జ్ఞాపకం...
చిరకాలపు తొలకరి జ్ఞాపకం..
ప్రేమ.."
శ్రీ కళ్యాణపు ..
Actual Written Date: 22.08.2001.

" మనస్సు.."

మనస్సు ...
సాగరం కంటే సువిశాలమైనది ...
దరిచేరుటకు సముద్రానికి వలె తీరం ఉండదు ..
సముద్రానికి ఆటు ,పోటు తాకిడిలు ఉన్నట్లుగా ...
మనస్సు అనే సాగరానికి .. తీపి ,చేదు జ్ఞాపకాల తాకిడి ఉంటుంది ...
లోతైనది ..అంతు చూచుటకు వీలు కానిది ...
ప్రళయ ప్రచండ బావోద్వేగాలను సృష్టిస్తుంది ...
పన్నీటి జల్లుల ప్రేమామృతాన్ని కురిపిస్తుంది...
నర్మ గర్భిత నిధి ...
వికట గీతాలకు వేదిక అది..
వికసించే కుసుమాలకు బృందావనం ..
సుగంధ పరిమళాల గంగా ప్రవాహం ...
నీలాకాశాన్ని నింపుకున్న ఇంద్రధనస్సు అది...
వర్షం కురిసిన సాయంత్రం పొలం గట్టు మీద నాట్యమాడే మయూరిలా నర్తిస్తుంది...
అన్నిటికంటే వేగమైనది ..భారమైనది ...రమ్యమైనది ...
రస, రాగ బావాలకు పుట్టినిల్లు ...
చదువుటకు వీలుకానిది ...చదివినా అర్డంకానిది ..ప్రతి ఎదలో తేనెలొలుకు పదగీతికల సృష్టికర్త ...
" మనస్సు.."

శ్రీనివాస్ కళ్యాణపు...
actual written date:
10.07.2002 ,1.15 am.
Place: United kingdom