22, మార్చి 2010, సోమవారం

పరిమళ

ఊహల వినీలాకాశంలో వేగుచుక్కవు నీవైతే ...
నిశీద రాత్రిని చీల్చుతూ వెలుగునిచ్చే వెన్నెలను నేనౌవుతా...
భూమి ,ఆకాశాలను కలిపే సరిహద్దువు నీవైతే...
ప్రతి అణువుకు వెలుగునిచ్చే సూర్య కిరణం నేనౌవుతా ...
జన ,జీవుల అంతరంగం నీవైతే...
ఆశల ఊయలకు ఉదయించే చిగురుటాకును నేనౌవుతా ...
ఆ సేతు హిమాచల కీర్తి కిరీటం నీవైతే ...
అణువణువులో నిక్షిప్తమైన సూక్ష్మ రూపాన్ని నేనౌవుతా..
మాటను పాటగా మార్చే గాత్రం నీవైతే ...
ఈ అనంత కోటి విశ్వంలో ఉదయించే ఆశలకు గమ్యాన్ని నేనౌవుతా...
అలుపెరగని చిరునవ్వువి నీవైతే...
అర్దించే పెదవులకు ఆపన్న హస్తం అందించే చిరునామా నేనౌవుతా...
వికశించే జీవితాలకు "పరిమాళాన్ని" ఇచ్చే మంచి గంధం నేనౌవుతా..
-- శ్రీనివాస్ కళ్యాణపు

March 18th 2010,
Mcdonough,Georgia,USA

ఒక నువ్వు...

ఒక నువ్వు..
తోలిజామున వచ్చిన స్వప్నం...
వెన్నెల్లో నడుస్తూ ఉన్నావు...
నాతో మాత్లాడుతూ ఉన్నావు ...
కాని నేను ఏమి వినలేకపోతున్నాను...
నన్ను ఎవరో..దూరంగా తీసుకువేలుతున్నారు... నీ నుండి..
వాళ్ళు ఎవరో నాకు తెలియదు.....
కనీసం ఎప్పుడు కూడా చూచినట్లు గుర్తులేదు...
చాల దూరం..చెప్పలేనంత..
ఉహించనలవి కానంత...
ఊరి పొలిమేరలు దాటి ...
నదీ ...నాదాలు దాటి...
సముద్రాలు గూండా ప్రయాణించి...
ఎడారుల్లో ...ఇసుక తిన్నెల మీద...
పడుతూ ...లేస్తూ ..ఆకలి దప్పికలతో ...అలమటిస్తూ ఒక నేను...
ఒక్కసారిగా మెలకువ వచ్చినది..
జరిగిన స్వప్నం గుర్తుకు వచ్చినది..
"కలే" కదా అని అనుకున్నా...
కొన్నాళ్ళకి కాని తెలిసింది... అది కల కాదు నిజం అని....
-- శ్రీనివాస్ కళ్యాణపు.

March 5th 2010,
Mcdonough,Georgia

7, మార్చి 2010, ఆదివారం

ఓ శరత్కాల వెన్నెల...

చిరునవ్వుల సుగంధాల సెలయేటిలో..పయనించే ఓ నవ యౌవ్వనిక...
అనునిత్యం మధినేలుతూ,నవవసంతపు చిగురుటాకువై...
ప్రకృతి మెడలో వేసిన రంగులమాలికవై..
ఓ శరత్కాల వెన్నెలలా ...
వినువీధిన మెరిసిన గగనతారవై...
నన్నె వరించుటకు వచ్చిన గంధర్వ కన్యవై..
నా మధిలో నిలిచిన ఓ పారిజాత ప్రణయమా...
నిలువెల్లా నాలో నీవై..నిరంతరం నా అంతరంగంలో ...
చిరస్థాయి చిరునామాగా మారి..
చిరు దివ్వెల వెలుగులను నింపి..
నిత్యం మరొక నేనై..నాలో ఉంటావని..
ఆశిస్తూ..ఆహ్వానిస్తూ ....నీ కోసం ఎదురు చూసే... నీ వెన్నెల...

శ్రీనివాస్.కళ్యాణపు..
03.07.2010 8.15
PM,
Mcdonough, GA, USA.

1, మార్చి 2010, సోమవారం

నీ తొలిపరిచయ క్షణం..

నీ తొలిపరిచయ క్షణం..
ఉషోదయపు తొలికిరణ ప్రసరణ లోని తేజంవలె ఉన్నది..
కనులు మూస్తే ఆ కమనీయ దృశ్యం కనుమరు అవుతుందేమో అనిపిస్తుంది...
ఆ అనిర్వచనీయమైన అనుభూతి నూతన శ్వాసనిస్తుంది ...