20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అణువుల తనువులో కొలువుదీరిన ఆ స్నేహం ...

వేకువజామున ​కను ​పాపల కొలను లో పుట్టిన ఓ స్వప్నం ...
అనిర్వచనీయమైన స్నేహ గంధ పరిమళాన్ని సాక్షాప్తరింపచేసింది...
అది ఒక కమనీయ దృశ్య కావ్యంగా ...తనువు ని తచ్చాడుతూ .. ​
హృదయ సాగరమంచున తలుకులీనిన ఉషోదయ సూర్య కిరణంలా ...
అంతరాల్లో నిక్షిప్తమైన చీకటి తెరలను తెంచుతూ ... తొలగిస్తూ
తొలకరి చినుకులా ఆరంబం అయి ... చినుకు చినుకు కలిసి ..
జడివానలా ... నిత్య ప్రవాహినై ... జీవనది లా మారి..
జన జీవుల ప్రాణాధార అయినట్లు గా ....
సంగీత సామ్రాజ్యంలో మంజీర నాదమై ... సాహిత్య తోటలో వికసించిన కుసుమరాజం లా ...
అణువుల తనువులో కొలువుదీరిన ఆ స్నేహం ...
అజరామరం ...
--
శ్రీనివాస్ కళ్యాణపు
Sep 20th 11.19 PM
Parlin,New Jersey

31, ఆగస్టు 2013, శనివారం

స్నేహ గీతం

ధనం సంపాదించవచ్చు .. పేరు సంపాదించవచ్చు... కాని మనస్సు లో గూడుకట్టుకున్న సౌందర్యాన్ని(వ్యక్తిత్వ వికాసం ,విచక్షణ ) కోల్పోతే .... భూమిపై నడయాడే నిత్య నిర్జీవ శరీరం గా ఉండటం తప్ప .... తేజోమయంతో కూడుకున్న దేహం ఎంత మాత్రం కాలేదు ... మన జీవితం లో ఏర్పడే కొన్ని పరిచయాలు కూడా అంతే . అవి అనునిత్యం హృదయాంతరాల్లో వికసించిన పరిమళబరిత పారిజాత కుసుమాలే అవుతాయి. ఏ కోటికో ఒకటి,రెండు పిల్ల తెమ్మెరలా మనస్సు ని తాకుతాయి... జీవిత చరమాంకం వరకు జ్ఞాపకాల అంతరాల్లో సజీవంగా ప్రతిష్టతం అయి ఉంటాయి .

-- 
శ్రీనివాస్ కళ్యాణపు 
పార్లిన్ , న్యూ జెర్సీ . 
ఆగష్టు 31 ,2013. 


20, ఆగస్టు 2013, మంగళవారం

అన్నగారు తెలుగు వాడు

ఆంధ్రప్రదేశ్ ... తెలంగాణ గ , ఆంధ్ర రాష్ట్రం గ విడిపోయింది ... ఎవడు చావు వాడు చస్తాడు ... ఇంకా బందులు ...దర్నాలు ఉండవు అనుకుంటున్నా ..... సామాన్యుడు తన పని తను చేసుకోవచ్చు ... అంతా బాగానే ఉంది .... కాని మా అన్నగారు పక్క రాష్ట్రం వాడు అయిపోయాడు అన్న ఫీలింగ్ ఒక్కటే బాదగా ఉంది ..... అన్నగారు తెలంగాణా లో కూడా ఒకసారి జన్మించండి ..... మనం సరిహద్దులు నిర్ణయించుకున్నాము ..... కాని అన్నగారి మీద అభిమానానికి సరిహద్దులు నిర్ణయించే హక్కు ఎవరికి లేదు ... నిన్నటిదాకా ఉన్న 28 రాష్ట్రాల ప్రజలు .... మేము బారతీయులము అని చెప్పుకుంటున్నాము కదా..... తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉంటే తప్పు ఏమి ఉంది .... ఇక నుండి ఆంధ్రుల అభిమాన నాయకుడు,ఆత్మబందువు అనటం కంటే ... తెలుగు వారి అభిమాన నాయకుడు,ఆత్మబందువు అనటం సమంజసం .... అయినా అన్నగారు తెలుగు వాడు .... అందరివాడు ... ఆ ఫీలింగ్ చాలు తెలుగు వాళ్ళం అంతా ఒక్కటే ఆన్న బావన రావటానికి . -- శ్రీనివాస్ కళ్యాణపు , గూడూరు , ఖమ్మం జిల్లా

స్వాతంత్ర్యం

స్వాతంత్ర్యం వచ్చాక జాతీయ కాంగ్రెస్ ని రద్దు చేయమని గాంధీ గారు చెప్పారు.భారత దేశాన్ని కులాల పేరిట ...మతాల పేరిట విడదీయటానికి లౌకికవాదం ముసుకు వేసుకున్న నెహ్రూ కుటుంభం అందుకు ఒప్పుకోలేదు ...తల్లి నుంచి బిడ్డని వేరు చేయటం ...., పంట పొలాన్ని సవుడు పొలం గా మార్చ గలటం ...,ప్రాణ స్నేహితులను .... బద్ద శత్రువులు అయ్యేలా చేయటం .... కాంగ్రెస్ కి... ఆ విష వృక్షం కింద పెరిగిన... ఇంకా పెరిగిపోతూనే ఉన్న ఈ కపట ఖద్దరు వేసుకున్న గోతికాడ నక్కలకి తెలిసినంత ... మరెవ్వరికి తెలీదు.. గాడ్సే గాంధీ గారిని ఒక్కసారే చంపాడు (అట ) ... కాని ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి క్షణం ఇంకా చంపుతూనే ఉన్నారు... క్షమించు మహాత్మ .... 99. 9 % నాయకులూ ఎలాగు పనికి మాలిన వాళ్ళే ....మరి ప్రజలు అంతే ఉన్నారు.. దైర్యం లేని చోట విజయం లేదు ... అభివృద్ధి లేదు .... ఎన్నికల్లో డబ్బు పంచేవాడు ఎలాగు ఎదవే .. మరి తీసుకుంటున్న జనాన్ని ఏమనాలి .... అలా పంచే వాడి ఇంట్లో ఏమన్నా కామదేనువు ఉందా ...వేలు ..లక్షలు ..కోట్లు అడగానే ఇవ్వతానికి... ఒక్క రోజు పంచిన డబ్బు .... 4 సంవత్సరాల 364 రోజులకి అవినీతి పరుడుగా బతకటానికి మనమే అధికారం ఇస్తున్నాము. ఇంకా వాడిని అనటం ఎందుకు ... నీకు కులం కావాలి. మతం కావాలి ... కాని జాతీయత వద్దు ... భారతీయత అంతకంటే వద్దు. జాతీయ జెండాని రూపొందించిన పింగలి వెంకయ్య గారి గురించి ఎంతమంది నాయకులకు తెలుసు. విగ్రం పెడితే ఆయన విగ్రహం పెట్టాలి.. ప్రతి అడ్డమైన వాడివి పెట్టటం ... ఎవడో ఏదో చేసాడు అని ... పాలాబిషేకం చెయ్యటమ్.. ఒక్కడన్న వయసుకు తగ్గ పనులు చేస్తున్నాడా ?... - శ్రీనివాస్ కళ్యాణపు

మానవ సంబంధాలు

మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలు అన్నమాట నిజం .ఈ ప్రపంచంలో నిజం మాట్లాడితే స్నేహితులను కోల్పోతాము.నిజం కంటే అందమైన అబద్దాన్నే ఎక్కువమంది ఇష్టపడుతున్నారు..అపోహలు ఎక్కువ అయినాయి... ఆత్మీయతతో .కూడిన మాటలుకంటే ...అవసరానికి అందంగా మాట్లాడటమే ఫ్యాషన్ అయింది..కాని ప్రతి ఒక్కరు నేను చాల ఫ్రాంక్ అండ్ మొహమాతంలేకుండా మాట్లాడుతా అని చెప్పుతారు...కాని ఎంతవరకు వాటిని వాళ్ళు అమలుపరుస్తారో తెలుసుకోలేకుండా ఉన్నారు.మనముందు నవ్విన చిరునవ్వులు ...మన వెనుక విషాన్ని చిమ్ముతున్నాయి...ఆత్మీయతకు అర్దాన్ని మారుస్తున్నాయి...మనం ఎవరో అవతల వాళ్లకి సరిగా తెలియకపోయినా మనగురించి మాట్లాడుకోవటం పరిపాటి అయిపొయింది.స్నేహానికి అర్ధం మారిపోతుంది..... ఎవరైనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తే ....ఆ ప్రశ్నించిన వ్యక్తిని ఒక పిచ్చివాడుగా చూస్తారు..,అందరు కాలం మారిపోతుంది అని మాట్లాడతారు...కాని మారేది కాలం కాదు ...మనుషులు ,మనసులు అని తెలుసుకోలేకపోతున్నాము .. ఈ సృష్టి ఏర్పడినప్పటినుంచి సూర్యుడు ,చంద్రుడు, భూమి గమనంలో మార్పులేదు.కాని వెయ్యి సంవత్సరాల క్రితం పుట్టినమనిషి ఈ రోజు లేడు.....అంటే... మనుషులే కదా మారేది...కాలం ఎక్కడ మారిపోయింది.....ఇంత తెలిసి కూడా మనిషి ఎందుకు ఇంతగా మనసులేకుండా ప్రవర్తిస్తున్నాడు...తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎందుకు దుర్బరం చేసుకుంటున్నాడు...సమాదానం లేదా అంటే ఉన్నది...దీని అంతటికి కారణం..మనిషి తన ఆర్దిక/వ్యక్తిగత హోదాని పెంచుకునే పరిణామ క్రమంలో ఒంటరి మార్గాన్ని ఎంచుకున్తున్నాడు..ఇంకా కొద్ది మంది మత చాందస వాదంతో మృగంలా మారుతున్నారు ...ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని పుస్తకాలు ఆయినా చాలవు మన అభివృద్ధి పరిణామ క్రమం స్వార్ధం తో కూడినది కాకుండా ...సమాజానికీ కొంత అయినా ఉపయోగపడేదిగా ఉంటే ... మన జీవితానికి అర్ధం ఉన్నట్లే.ఈ భూమి మీద పుట్టిన ప్రతిమనిసికి ...వేరొక మనిషితో అవసరం ఉంటుంది....ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం అనేది నిరంతర ప్రక్రియ...అది ఎప్పుడో ఏడాదికి ఒకసారి వచ్చే పండగ కాదు కదా... - శ్రీనివాస్ కళ్యాణపు