15, ఏప్రిల్ 2010, గురువారం

నిశబ్ద గీతం

కొద్ది క్షణాల పరిచయం.....
కాని .... కొన్ని యుగాల జీవితానికి సరిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించినది...
అంతలోనే ..... ఏమి జరిగిందో....
రంగు..రంగుల పుష్పాలతో హరివిల్లు లా ఉన్న బృందావనం ...
మరుభూమిగా మారిపోయింది....
గొంతు దాటి ...మనస్సులను గెలుచుకోవాల్సిన ...." మధుర గీతం.."
ఎప్పటికి గుండె దాటని "నిశబ్ద గీతంగానే" మిగిలిపోయింది.....చివరి మజిలీగా...చీకటి రాత్రిగా....
-- శ్రీ కళ్యాణపు
04.15.2010, Mcdonough,
GA,USA
.

14, ఏప్రిల్ 2010, బుధవారం

మౌనం గా...

నా చుట్టూ నన్ను కోరుకునే ప్రపంచం...ఒక వైపు...
నన్ను నన్నుగా గుర్తించే..స్నేహాలు ఒక వైపు...
ఆకాశమే హద్దుగా నన్ను ప్రేమించే ...నా కుటుంబం ఒక వైపు...
నీ ఆలోచనలతో...ప్రపంచానికి దూరంగా ...
కలల ...అలల వేగానికి బందీనై...
ఈ ప్రపంచపు ఎల్లలు దాటి...మరొక ప్రపంచపు... వినీలాకసంలో...రాలిపోని ద్రువతారనై...
నిన్ను నిన్నుగా ఆరాదించే...నిండు వెన్నెలను నేనై...
మౌనం గా...మనస్సు లోతుల్లో ....మరణించే వరకు...
ఒక్కడిగా...ఒంటరినై ...
మరొక లోకంలో నేను...

-- శ్రీ కళ్యాణపు

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

జీవనది...

తను ప్రవహించే జీవనది...ఒయ్యారాల ఒగలు పోతూ...
నిశబ్ధాన్ని చీల్చుతూ...కష్ట,సుఖాలను తీర్చే.హృధయ కావేరి..
తన ప్రవాహపు గల గలలు..సిరి మువ్వల మంజీర నాధాలు...
పంట పొలాలను తన అమృత ధారతో పావనం చేసే ఆకాశ గంగా ప్రవాహిని..
కలల అలలలో ...కనుపాపల అంచులపై ...అలుపెరగక నర్తించే నిత్య నాట్య మయూరి...
అంతటి జీవనది ....
ఒక్కసారిగా ఆగ్రహించినది...
ప్రళయాన్ని పరిచయం చేస్తూ...కాలాన్ని,కలలను.వెనక్కు నెట్టి ...
జీవధారను...రుధిర ధార ఎందుకు చేసిందో..?
ఎవరికి తెలుసు...ఆగిపోయిన ప్రవాహానికి...కాలానికి...గుండె చప్పుడికి తప్ప...

--శ్రీనివాస్ కళ్యాణపు...
04.09.2010 , 1 am ,
Mcdonough, USA.

1, ఏప్రిల్ 2010, గురువారం

మనిషిగా బ్రతకలేమా ?

రాజ్యాన్ని జయించిన రాజైనా...ఆకలికి,దప్పికలకి బానిస కాక తప్పదు.మనిషి ఎంతో సాధినంచాను అని అనుకుంటున్న ఈ కాలంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి...ప్రపంచంలో ఎ మూలకి పోయినా.తాగు నీటికోసం మైళ్ళకి మైళ్ళు నడుస్తునే ఉన్నాడు..అంతర్గతంగా కొట్టుకుంటునే ఉన్నాడు.సరిఆయిన వైద్యం లేదు..ఉండటానికి సరియిన ఇల్లు లేదు ...ఒకరోజు పని లేకపోతే ఆ తరువాత రోజు పస్తులు ఉండే పరిస్థితి ఎన్నో చోట్ల కనిపిస్తున్నది.ఇవి అన్ని సాద్యమైనంత త్వరగా పరిస్కరించుకోవాలసిన సమస్యలు. ఇవన్ని
మరచి కొత్త సమస్యలను తెచ్చుకుంటున్నాము... మనం మనుషులుగా బ్రతుకుతున్నామా ?మతం మత్తులో ....కులం మత్తులో సాదించేదేమిటి? ఏ మతం హింసని కోరుకోలేదు..మరి మనిషిగా పుట్టి...జ్ఞానమున్న జంతువుగా పేరు పొందిన మనం ఎందుకు రక్తం తాగే అడవిమృగంలా ప్రవర్తిస్తున్నాము... ఎంత కాలం ఓట్ల కోసం జన హితం మరచి...అనాగరికముగా బ్రతుకుదాము...
అందరు విద్యావంతులు అయితే దేశం సుసంపన్నం అవుతుంది అంటారు ...మరి ఈ మారణ హొమాలని జరుపుతున్నది విద్యావంతులే కదా...
మతం..కులం సున్నితమైన అంశాలంటూ ఎంత కాలం ఈ నరమేదాన్ని బరిద్దాము...
తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవటానికి...లక్షలు ..కోట్లు పెట్టి..కమిటీలు వేసి...పోలీసు బలగాలను పెట్టి... పట్టుకుని , కోర్టు కి ఒప్ప జెప్పి ఉరి శిక్ష వేయిస్తే...చివరకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టం... మరి న్యాయస్తానం ...ఈ కమిటీలు... పోలీసులు ఎందుకు...
రాజ్యాంగాన్ని మార్చాలంటే రాజకీయనాయకులకు భయం ...ఓట్లు పోతాయని....
అవినీతిని అంతం చేయాలి అంటే ....అధికారులకి భయం ... లంచం దొరకదేమో అని...
కనీసం ప్రజలు (అంటే మనం )అయినా మారతారా అంటే... మందుకి..కులానికి..మాతానికి..వర్గాలకి బానిసలు అయి...గొర్రెల్లా తల ఊపుతాం ..
రాజకీయాల్లోకి యువత రావాలి అంటారు .... మరి రాజకీయ వారసులకి తప్ప వేరే వాళ్లకి అవకాశం ఈ రాబందులు ఎక్కడ ఇస్తాయి..
"సునామి రావాలి.... ఒక ప్రాంతానికి కాదు....సమస్త భూమండలానికి ....ఒక్కసారిగా ...సర్వం పోయేలా ...
అప్పుడైనా ఈ భూమి కి ...దరిద్రాన్ని ...దరిద్రులను మోసే..బాద తప్పుతుంది...
మరల భూమిపై జీవి ఉద్భవించి....అనాగారికులుగా మారేదాకా ..... భూమికి..గాలికి..నీరుకి..ఆకాశానికి ...అగ్నికి ....విశ్రాంతి ఆయినా దొరుకుతుంది....