ధనం సంపాదించవచ్చు .. పేరు సంపాదించవచ్చు... కాని మనస్సు లో గూడుకట్టుకున్న సౌందర్యాన్ని(వ్యక్తిత్వ వికాసం ,విచక్షణ ) కోల్పోతే .... భూమిపై నడయాడే నిత్య నిర్జీవ శరీరం గా ఉండటం తప్ప .... తేజోమయంతో కూడుకున్న దేహం ఎంత మాత్రం కాలేదు ...
మన జీవితం లో ఏర్పడే కొన్ని పరిచయాలు కూడా అంతే .
అవి అనునిత్యం హృదయాంతరాల్లో వికసించిన పరిమళబరిత పారిజాత కుసుమాలే అవుతాయి.
ఏ కోటికో ఒకటి,రెండు పిల్ల తెమ్మెరలా మనస్సు ని తాకుతాయి... జీవిత చరమాంకం వరకు జ్ఞాపకాల అంతరాల్లో సజీవంగా ప్రతిష్టతం అయి ఉంటాయి .
--
శ్రీనివాస్ కళ్యాణపు
పార్లిన్ , న్యూ జెర్సీ .
ఆగష్టు 31 ,2013.