20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అణువుల తనువులో కొలువుదీరిన ఆ స్నేహం ...

వేకువజామున ​కను ​పాపల కొలను లో పుట్టిన ఓ స్వప్నం ...
అనిర్వచనీయమైన స్నేహ గంధ పరిమళాన్ని సాక్షాప్తరింపచేసింది...
అది ఒక కమనీయ దృశ్య కావ్యంగా ...తనువు ని తచ్చాడుతూ .. ​
హృదయ సాగరమంచున తలుకులీనిన ఉషోదయ సూర్య కిరణంలా ...
అంతరాల్లో నిక్షిప్తమైన చీకటి తెరలను తెంచుతూ ... తొలగిస్తూ
తొలకరి చినుకులా ఆరంబం అయి ... చినుకు చినుకు కలిసి ..
జడివానలా ... నిత్య ప్రవాహినై ... జీవనది లా మారి..
జన జీవుల ప్రాణాధార అయినట్లు గా ....
సంగీత సామ్రాజ్యంలో మంజీర నాదమై ... సాహిత్య తోటలో వికసించిన కుసుమరాజం లా ...
అణువుల తనువులో కొలువుదీరిన ఆ స్నేహం ...
అజరామరం ...
--
శ్రీనివాస్ కళ్యాణపు
Sep 20th 11.19 PM
Parlin,New Jersey

31, ఆగస్టు 2013, శనివారం

స్నేహ గీతం

ధనం సంపాదించవచ్చు .. పేరు సంపాదించవచ్చు... కాని మనస్సు లో గూడుకట్టుకున్న సౌందర్యాన్ని(వ్యక్తిత్వ వికాసం ,విచక్షణ ) కోల్పోతే .... భూమిపై నడయాడే నిత్య నిర్జీవ శరీరం గా ఉండటం తప్ప .... తేజోమయంతో కూడుకున్న దేహం ఎంత మాత్రం కాలేదు ... మన జీవితం లో ఏర్పడే కొన్ని పరిచయాలు కూడా అంతే . అవి అనునిత్యం హృదయాంతరాల్లో వికసించిన పరిమళబరిత పారిజాత కుసుమాలే అవుతాయి. ఏ కోటికో ఒకటి,రెండు పిల్ల తెమ్మెరలా మనస్సు ని తాకుతాయి... జీవిత చరమాంకం వరకు జ్ఞాపకాల అంతరాల్లో సజీవంగా ప్రతిష్టతం అయి ఉంటాయి .

-- 
శ్రీనివాస్ కళ్యాణపు 
పార్లిన్ , న్యూ జెర్సీ . 
ఆగష్టు 31 ,2013. 


20, ఆగస్టు 2013, మంగళవారం

అన్నగారు తెలుగు వాడు

ఆంధ్రప్రదేశ్ ... తెలంగాణ గ , ఆంధ్ర రాష్ట్రం గ విడిపోయింది ... ఎవడు చావు వాడు చస్తాడు ... ఇంకా బందులు ...దర్నాలు ఉండవు అనుకుంటున్నా ..... సామాన్యుడు తన పని తను చేసుకోవచ్చు ... అంతా బాగానే ఉంది .... కాని మా అన్నగారు పక్క రాష్ట్రం వాడు అయిపోయాడు అన్న ఫీలింగ్ ఒక్కటే బాదగా ఉంది ..... అన్నగారు తెలంగాణా లో కూడా ఒకసారి జన్మించండి ..... మనం సరిహద్దులు నిర్ణయించుకున్నాము ..... కాని అన్నగారి మీద అభిమానానికి సరిహద్దులు నిర్ణయించే హక్కు ఎవరికి లేదు ... నిన్నటిదాకా ఉన్న 28 రాష్ట్రాల ప్రజలు .... మేము బారతీయులము అని చెప్పుకుంటున్నాము కదా..... తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉంటే తప్పు ఏమి ఉంది .... ఇక నుండి ఆంధ్రుల అభిమాన నాయకుడు,ఆత్మబందువు అనటం కంటే ... తెలుగు వారి అభిమాన నాయకుడు,ఆత్మబందువు అనటం సమంజసం .... అయినా అన్నగారు తెలుగు వాడు .... అందరివాడు ... ఆ ఫీలింగ్ చాలు తెలుగు వాళ్ళం అంతా ఒక్కటే ఆన్న బావన రావటానికి . -- శ్రీనివాస్ కళ్యాణపు , గూడూరు , ఖమ్మం జిల్లా

స్వాతంత్ర్యం

స్వాతంత్ర్యం వచ్చాక జాతీయ కాంగ్రెస్ ని రద్దు చేయమని గాంధీ గారు చెప్పారు.భారత దేశాన్ని కులాల పేరిట ...మతాల పేరిట విడదీయటానికి లౌకికవాదం ముసుకు వేసుకున్న నెహ్రూ కుటుంభం అందుకు ఒప్పుకోలేదు ...తల్లి నుంచి బిడ్డని వేరు చేయటం ...., పంట పొలాన్ని సవుడు పొలం గా మార్చ గలటం ...,ప్రాణ స్నేహితులను .... బద్ద శత్రువులు అయ్యేలా చేయటం .... కాంగ్రెస్ కి... ఆ విష వృక్షం కింద పెరిగిన... ఇంకా పెరిగిపోతూనే ఉన్న ఈ కపట ఖద్దరు వేసుకున్న గోతికాడ నక్కలకి తెలిసినంత ... మరెవ్వరికి తెలీదు.. గాడ్సే గాంధీ గారిని ఒక్కసారే చంపాడు (అట ) ... కాని ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి క్షణం ఇంకా చంపుతూనే ఉన్నారు... క్షమించు మహాత్మ .... 99. 9 % నాయకులూ ఎలాగు పనికి మాలిన వాళ్ళే ....మరి ప్రజలు అంతే ఉన్నారు.. దైర్యం లేని చోట విజయం లేదు ... అభివృద్ధి లేదు .... ఎన్నికల్లో డబ్బు పంచేవాడు ఎలాగు ఎదవే .. మరి తీసుకుంటున్న జనాన్ని ఏమనాలి .... అలా పంచే వాడి ఇంట్లో ఏమన్నా కామదేనువు ఉందా ...వేలు ..లక్షలు ..కోట్లు అడగానే ఇవ్వతానికి... ఒక్క రోజు పంచిన డబ్బు .... 4 సంవత్సరాల 364 రోజులకి అవినీతి పరుడుగా బతకటానికి మనమే అధికారం ఇస్తున్నాము. ఇంకా వాడిని అనటం ఎందుకు ... నీకు కులం కావాలి. మతం కావాలి ... కాని జాతీయత వద్దు ... భారతీయత అంతకంటే వద్దు. జాతీయ జెండాని రూపొందించిన పింగలి వెంకయ్య గారి గురించి ఎంతమంది నాయకులకు తెలుసు. విగ్రం పెడితే ఆయన విగ్రహం పెట్టాలి.. ప్రతి అడ్డమైన వాడివి పెట్టటం ... ఎవడో ఏదో చేసాడు అని ... పాలాబిషేకం చెయ్యటమ్.. ఒక్కడన్న వయసుకు తగ్గ పనులు చేస్తున్నాడా ?... - శ్రీనివాస్ కళ్యాణపు

మానవ సంబంధాలు

మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలు అన్నమాట నిజం .ఈ ప్రపంచంలో నిజం మాట్లాడితే స్నేహితులను కోల్పోతాము.నిజం కంటే అందమైన అబద్దాన్నే ఎక్కువమంది ఇష్టపడుతున్నారు..అపోహలు ఎక్కువ అయినాయి... ఆత్మీయతతో .కూడిన మాటలుకంటే ...అవసరానికి అందంగా మాట్లాడటమే ఫ్యాషన్ అయింది..కాని ప్రతి ఒక్కరు నేను చాల ఫ్రాంక్ అండ్ మొహమాతంలేకుండా మాట్లాడుతా అని చెప్పుతారు...కాని ఎంతవరకు వాటిని వాళ్ళు అమలుపరుస్తారో తెలుసుకోలేకుండా ఉన్నారు.మనముందు నవ్విన చిరునవ్వులు ...మన వెనుక విషాన్ని చిమ్ముతున్నాయి...ఆత్మీయతకు అర్దాన్ని మారుస్తున్నాయి...మనం ఎవరో అవతల వాళ్లకి సరిగా తెలియకపోయినా మనగురించి మాట్లాడుకోవటం పరిపాటి అయిపొయింది.స్నేహానికి అర్ధం మారిపోతుంది..... ఎవరైనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తే ....ఆ ప్రశ్నించిన వ్యక్తిని ఒక పిచ్చివాడుగా చూస్తారు..,అందరు కాలం మారిపోతుంది అని మాట్లాడతారు...కాని మారేది కాలం కాదు ...మనుషులు ,మనసులు అని తెలుసుకోలేకపోతున్నాము .. ఈ సృష్టి ఏర్పడినప్పటినుంచి సూర్యుడు ,చంద్రుడు, భూమి గమనంలో మార్పులేదు.కాని వెయ్యి సంవత్సరాల క్రితం పుట్టినమనిషి ఈ రోజు లేడు.....అంటే... మనుషులే కదా మారేది...కాలం ఎక్కడ మారిపోయింది.....ఇంత తెలిసి కూడా మనిషి ఎందుకు ఇంతగా మనసులేకుండా ప్రవర్తిస్తున్నాడు...తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎందుకు దుర్బరం చేసుకుంటున్నాడు...సమాదానం లేదా అంటే ఉన్నది...దీని అంతటికి కారణం..మనిషి తన ఆర్దిక/వ్యక్తిగత హోదాని పెంచుకునే పరిణామ క్రమంలో ఒంటరి మార్గాన్ని ఎంచుకున్తున్నాడు..ఇంకా కొద్ది మంది మత చాందస వాదంతో మృగంలా మారుతున్నారు ...ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని పుస్తకాలు ఆయినా చాలవు మన అభివృద్ధి పరిణామ క్రమం స్వార్ధం తో కూడినది కాకుండా ...సమాజానికీ కొంత అయినా ఉపయోగపడేదిగా ఉంటే ... మన జీవితానికి అర్ధం ఉన్నట్లే.ఈ భూమి మీద పుట్టిన ప్రతిమనిసికి ...వేరొక మనిషితో అవసరం ఉంటుంది....ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం అనేది నిరంతర ప్రక్రియ...అది ఎప్పుడో ఏడాదికి ఒకసారి వచ్చే పండగ కాదు కదా... - శ్రీనివాస్ కళ్యాణపు

25, మే 2010, మంగళవారం

మనిషి మనుగడకి భద్రత లేదా ...

కొద్ది రోజుల వ్యవధిలో మూడు వ్యధాభరిత సంఘటనలు ...
లైలా తుఫాన్, మంగళూరు విమాన ప్రమాదం,సంపాదకుడు ,సిని కవి,విమర్శకుడు వేటూరి మరణం..
వేటూరి జీవితంలో అన్ని చూసినవాడు,తను సాదించాలిసినది సాదించి మరణించాడు...ఇంకా కొంతకాలం జీవించి వుంటే తన సాహిత్య పరిమళాలను ఆస్వాదించే అవకాశం మనకి వుండేది...
వేటూరి మరణం కంటే ఎక్కువగా బాదించినది విమాన ప్రమాద సంఘటన ...లైలా తుఫాన్ మిగిల్చిన విషాదం.. రోజువారి పనుల మీద ఆడారపడే జీవితాలకు, రైతులకు కోలుకొని నష్టాన్ని మిగిల్చి జేవచ్చావాలుగా మార్చినది... ఏ ప్రభుత్వం వచ్చిన సామాన్య జీవికి, రైతుకు ఒరిగేదేమీ లేదు... నాయకుల ఓదార్పు యాత్రలు బాదితుల కస్టాలు తీర్చవు.. అధికార నాయకుల ఓదార్పు యాత్ర ... మరల అధికారాన్ని సొంతం చేసుకోవటానికి... ప్రతిపక్ష నాయకుల ఓదార్పు యాత్ర ...దూరమైన అధికారాన్ని తిరిగి పొందటానికి...; పాదయాత్రల,రధయాత్రల,ఓదార్పు యాత్రల అర్ధం ..పరమార్దం ఇంతే...
సామాన్య మానవుడికి ఒరిగేది ఏమిలేదు...వీళ్ళ యాత్రల , రోడ్ షోస్ వల్ల ఒకరోజు పని దండగ..ట్రాఫిక్ కి ఇబ్బంది...


మంగలూరు విమాన ప్రమాదం...అత్యంత దురదృష్టకరమైనది ...మాటలకందని విషాదం... ప్రమాదం జరిగాక వేసే నిజ నిర్దారణ కమిటీలు ....Exgracia లు ...ఇవేమీ పోయిన ప్రాణాలను తిరిగి తేలేవు...వీటికి పెట్టె ఖర్చుని ... నిర్మాణాల నాణ్యతకి...ప్రజల భద్రతకి పెడితే..ఇటువంటి విషాదాలను కొంతవరకైన ఆపవచ్చు కదా...కాని అలా చేస్తే... అక్రమంగా సంపాదించే అవకాశాన్ని మన నీతిమాలిన నాయకులు...అవినీతి అధికారులు కోల్పోతారుకదా...
పాలకుల్లో...పరిపాలనలో.. మార్పు రానంత వరకు..ఇలాంటి దురవార్తలు వింటూనే వుంటాము...

--Sri Kalyanapu
Ann Arbor, MI
05.25.2010

15, ఏప్రిల్ 2010, గురువారం

నిశబ్ద గీతం

కొద్ది క్షణాల పరిచయం.....
కాని .... కొన్ని యుగాల జీవితానికి సరిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించినది...
అంతలోనే ..... ఏమి జరిగిందో....
రంగు..రంగుల పుష్పాలతో హరివిల్లు లా ఉన్న బృందావనం ...
మరుభూమిగా మారిపోయింది....
గొంతు దాటి ...మనస్సులను గెలుచుకోవాల్సిన ...." మధుర గీతం.."
ఎప్పటికి గుండె దాటని "నిశబ్ద గీతంగానే" మిగిలిపోయింది.....చివరి మజిలీగా...చీకటి రాత్రిగా....
-- శ్రీ కళ్యాణపు
04.15.2010, Mcdonough,
GA,USA
.

14, ఏప్రిల్ 2010, బుధవారం

మౌనం గా...

నా చుట్టూ నన్ను కోరుకునే ప్రపంచం...ఒక వైపు...
నన్ను నన్నుగా గుర్తించే..స్నేహాలు ఒక వైపు...
ఆకాశమే హద్దుగా నన్ను ప్రేమించే ...నా కుటుంబం ఒక వైపు...
నీ ఆలోచనలతో...ప్రపంచానికి దూరంగా ...
కలల ...అలల వేగానికి బందీనై...
ఈ ప్రపంచపు ఎల్లలు దాటి...మరొక ప్రపంచపు... వినీలాకసంలో...రాలిపోని ద్రువతారనై...
నిన్ను నిన్నుగా ఆరాదించే...నిండు వెన్నెలను నేనై...
మౌనం గా...మనస్సు లోతుల్లో ....మరణించే వరకు...
ఒక్కడిగా...ఒంటరినై ...
మరొక లోకంలో నేను...

-- శ్రీ కళ్యాణపు

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

జీవనది...

తను ప్రవహించే జీవనది...ఒయ్యారాల ఒగలు పోతూ...
నిశబ్ధాన్ని చీల్చుతూ...కష్ట,సుఖాలను తీర్చే.హృధయ కావేరి..
తన ప్రవాహపు గల గలలు..సిరి మువ్వల మంజీర నాధాలు...
పంట పొలాలను తన అమృత ధారతో పావనం చేసే ఆకాశ గంగా ప్రవాహిని..
కలల అలలలో ...కనుపాపల అంచులపై ...అలుపెరగక నర్తించే నిత్య నాట్య మయూరి...
అంతటి జీవనది ....
ఒక్కసారిగా ఆగ్రహించినది...
ప్రళయాన్ని పరిచయం చేస్తూ...కాలాన్ని,కలలను.వెనక్కు నెట్టి ...
జీవధారను...రుధిర ధార ఎందుకు చేసిందో..?
ఎవరికి తెలుసు...ఆగిపోయిన ప్రవాహానికి...కాలానికి...గుండె చప్పుడికి తప్ప...

--శ్రీనివాస్ కళ్యాణపు...
04.09.2010 , 1 am ,
Mcdonough, USA.

1, ఏప్రిల్ 2010, గురువారం

మనిషిగా బ్రతకలేమా ?

రాజ్యాన్ని జయించిన రాజైనా...ఆకలికి,దప్పికలకి బానిస కాక తప్పదు.మనిషి ఎంతో సాధినంచాను అని అనుకుంటున్న ఈ కాలంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి...ప్రపంచంలో ఎ మూలకి పోయినా.తాగు నీటికోసం మైళ్ళకి మైళ్ళు నడుస్తునే ఉన్నాడు..అంతర్గతంగా కొట్టుకుంటునే ఉన్నాడు.సరిఆయిన వైద్యం లేదు..ఉండటానికి సరియిన ఇల్లు లేదు ...ఒకరోజు పని లేకపోతే ఆ తరువాత రోజు పస్తులు ఉండే పరిస్థితి ఎన్నో చోట్ల కనిపిస్తున్నది.ఇవి అన్ని సాద్యమైనంత త్వరగా పరిస్కరించుకోవాలసిన సమస్యలు. ఇవన్ని
మరచి కొత్త సమస్యలను తెచ్చుకుంటున్నాము... మనం మనుషులుగా బ్రతుకుతున్నామా ?మతం మత్తులో ....కులం మత్తులో సాదించేదేమిటి? ఏ మతం హింసని కోరుకోలేదు..మరి మనిషిగా పుట్టి...జ్ఞానమున్న జంతువుగా పేరు పొందిన మనం ఎందుకు రక్తం తాగే అడవిమృగంలా ప్రవర్తిస్తున్నాము... ఎంత కాలం ఓట్ల కోసం జన హితం మరచి...అనాగరికముగా బ్రతుకుదాము...
అందరు విద్యావంతులు అయితే దేశం సుసంపన్నం అవుతుంది అంటారు ...మరి ఈ మారణ హొమాలని జరుపుతున్నది విద్యావంతులే కదా...
మతం..కులం సున్నితమైన అంశాలంటూ ఎంత కాలం ఈ నరమేదాన్ని బరిద్దాము...
తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవటానికి...లక్షలు ..కోట్లు పెట్టి..కమిటీలు వేసి...పోలీసు బలగాలను పెట్టి... పట్టుకుని , కోర్టు కి ఒప్ప జెప్పి ఉరి శిక్ష వేయిస్తే...చివరకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టం... మరి న్యాయస్తానం ...ఈ కమిటీలు... పోలీసులు ఎందుకు...
రాజ్యాంగాన్ని మార్చాలంటే రాజకీయనాయకులకు భయం ...ఓట్లు పోతాయని....
అవినీతిని అంతం చేయాలి అంటే ....అధికారులకి భయం ... లంచం దొరకదేమో అని...
కనీసం ప్రజలు (అంటే మనం )అయినా మారతారా అంటే... మందుకి..కులానికి..మాతానికి..వర్గాలకి బానిసలు అయి...గొర్రెల్లా తల ఊపుతాం ..
రాజకీయాల్లోకి యువత రావాలి అంటారు .... మరి రాజకీయ వారసులకి తప్ప వేరే వాళ్లకి అవకాశం ఈ రాబందులు ఎక్కడ ఇస్తాయి..
"సునామి రావాలి.... ఒక ప్రాంతానికి కాదు....సమస్త భూమండలానికి ....ఒక్కసారిగా ...సర్వం పోయేలా ...
అప్పుడైనా ఈ భూమి కి ...దరిద్రాన్ని ...దరిద్రులను మోసే..బాద తప్పుతుంది...
మరల భూమిపై జీవి ఉద్భవించి....అనాగారికులుగా మారేదాకా ..... భూమికి..గాలికి..నీరుకి..ఆకాశానికి ...అగ్నికి ....విశ్రాంతి ఆయినా దొరుకుతుంది....

22, మార్చి 2010, సోమవారం

పరిమళ

ఊహల వినీలాకాశంలో వేగుచుక్కవు నీవైతే ...
నిశీద రాత్రిని చీల్చుతూ వెలుగునిచ్చే వెన్నెలను నేనౌవుతా...
భూమి ,ఆకాశాలను కలిపే సరిహద్దువు నీవైతే...
ప్రతి అణువుకు వెలుగునిచ్చే సూర్య కిరణం నేనౌవుతా ...
జన ,జీవుల అంతరంగం నీవైతే...
ఆశల ఊయలకు ఉదయించే చిగురుటాకును నేనౌవుతా ...
ఆ సేతు హిమాచల కీర్తి కిరీటం నీవైతే ...
అణువణువులో నిక్షిప్తమైన సూక్ష్మ రూపాన్ని నేనౌవుతా..
మాటను పాటగా మార్చే గాత్రం నీవైతే ...
ఈ అనంత కోటి విశ్వంలో ఉదయించే ఆశలకు గమ్యాన్ని నేనౌవుతా...
అలుపెరగని చిరునవ్వువి నీవైతే...
అర్దించే పెదవులకు ఆపన్న హస్తం అందించే చిరునామా నేనౌవుతా...
వికశించే జీవితాలకు "పరిమాళాన్ని" ఇచ్చే మంచి గంధం నేనౌవుతా..
-- శ్రీనివాస్ కళ్యాణపు

March 18th 2010,
Mcdonough,Georgia,USA

ఒక నువ్వు...

ఒక నువ్వు..
తోలిజామున వచ్చిన స్వప్నం...
వెన్నెల్లో నడుస్తూ ఉన్నావు...
నాతో మాత్లాడుతూ ఉన్నావు ...
కాని నేను ఏమి వినలేకపోతున్నాను...
నన్ను ఎవరో..దూరంగా తీసుకువేలుతున్నారు... నీ నుండి..
వాళ్ళు ఎవరో నాకు తెలియదు.....
కనీసం ఎప్పుడు కూడా చూచినట్లు గుర్తులేదు...
చాల దూరం..చెప్పలేనంత..
ఉహించనలవి కానంత...
ఊరి పొలిమేరలు దాటి ...
నదీ ...నాదాలు దాటి...
సముద్రాలు గూండా ప్రయాణించి...
ఎడారుల్లో ...ఇసుక తిన్నెల మీద...
పడుతూ ...లేస్తూ ..ఆకలి దప్పికలతో ...అలమటిస్తూ ఒక నేను...
ఒక్కసారిగా మెలకువ వచ్చినది..
జరిగిన స్వప్నం గుర్తుకు వచ్చినది..
"కలే" కదా అని అనుకున్నా...
కొన్నాళ్ళకి కాని తెలిసింది... అది కల కాదు నిజం అని....
-- శ్రీనివాస్ కళ్యాణపు.

March 5th 2010,
Mcdonough,Georgia

7, మార్చి 2010, ఆదివారం

ఓ శరత్కాల వెన్నెల...

చిరునవ్వుల సుగంధాల సెలయేటిలో..పయనించే ఓ నవ యౌవ్వనిక...
అనునిత్యం మధినేలుతూ,నవవసంతపు చిగురుటాకువై...
ప్రకృతి మెడలో వేసిన రంగులమాలికవై..
ఓ శరత్కాల వెన్నెలలా ...
వినువీధిన మెరిసిన గగనతారవై...
నన్నె వరించుటకు వచ్చిన గంధర్వ కన్యవై..
నా మధిలో నిలిచిన ఓ పారిజాత ప్రణయమా...
నిలువెల్లా నాలో నీవై..నిరంతరం నా అంతరంగంలో ...
చిరస్థాయి చిరునామాగా మారి..
చిరు దివ్వెల వెలుగులను నింపి..
నిత్యం మరొక నేనై..నాలో ఉంటావని..
ఆశిస్తూ..ఆహ్వానిస్తూ ....నీ కోసం ఎదురు చూసే... నీ వెన్నెల...

శ్రీనివాస్.కళ్యాణపు..
03.07.2010 8.15
PM,
Mcdonough, GA, USA.

1, మార్చి 2010, సోమవారం

నీ తొలిపరిచయ క్షణం..

నీ తొలిపరిచయ క్షణం..
ఉషోదయపు తొలికిరణ ప్రసరణ లోని తేజంవలె ఉన్నది..
కనులు మూస్తే ఆ కమనీయ దృశ్యం కనుమరు అవుతుందేమో అనిపిస్తుంది...
ఆ అనిర్వచనీయమైన అనుభూతి నూతన శ్వాసనిస్తుంది ...

23, జులై 2009, గురువారం

This is not at all how

This is not at all how...I thought it was supposed to be...I had so many plans for ***I had so many dreams...And now you've gone away...And left me with the memories of your smile...And nothing I can sayAnd nothing I can do...Can take away the pain...The pain of losing ***, but ...
We can say goodbye with hope...'Cause I know our goodbye is not the end, And I can grieve with hope'Cause we believe with hope...There's a place where we'll see your face again...I'll see your face again
And never have I known...Anything so hard to understand...And never have I questioned moreThe wisdom of God's plan...But through the cloud of tears...And I imagine *** ...Where you wanted most to be...Seeing all your dreams come true'Cause now you're home...And now you're free, and ...
I have this hope as an anchor...'Cause I believe that everything...And say goodbye with hope...I wait with hope...And I ache with hope...I hold on with hope...We let go with hope
( Remembrance of my friend.... Memories From Past....)
శ్రీ కళ్యాణపు

6, జులై 2009, సోమవారం

హృదయ నివేదన

ఈ రోజు నాకు ఒక స్వప్నం సాక్షాత్కరించింది...
చాల గాడ నిద్రలో ఉన్నాను..
ఒంటరిగా నడుస్తూ ఉన్నాను..
చాలా దాహంగా ఉన్నది...
అది ఎడారి ప్రాంతం...
ఎక్కడ నీటి కొలను కాని..ఒయాసిస్సులు జాడ కాని కనిపించటం లేదు..
కళ్ళు బరువెక్కుతున్నాయి...కాళ్ళు ముందుకు కదలటం లేదు..
నెమ్మదిగా అచేతనా స్థితిలోకి వెళ్ళాను...
ఎవరో నాముందు నిల్చుని ఉన్నారు..తనని ఎప్పుడు చూడలేదు..
అవి నా చివరి క్షణాలుగా అనిపించాయి...
వచ్చిన వ్యక్తి నా చివరి కోరిక అడిగాడు..
నా స్నేహితులని అందరిని కలవాలి అని చెప్పా..
అందరిని కష్టం ..ఎవరిని అయిన ఒకరినే ఎంచుకోమని చెప్పాడు..
అలా ఒక్కరినే ఎంచుకోవటం నాకిష్టంలేదు అని చెప్పా.. అందరిని అంటే ...చాల కష్టం అన్నాడు..
చివరికి నా అంతిమ సందేశం నా స్నేహితులకి చేర్చుతా అన్నాడు..
నేను నీ స్నేహితుడిగా మరణించా అని నీతో చెప్పమని అన్నాను...
అతను సరే అన్నాడు...
నేను నా చివరి శ్వాసను వదిలినాను..
అకస్మాత్తుగా నిద్ర నుండి మేల్కొన్నాను...
కల చెదిరి పోయింది...కాని జరిగింది గుర్తుకు వచ్చినది ...
నా మరణాన్ని చూపిన కల గురించి భయపడలేదు...
ఎందుకంటే...
నేను నీ స్నేహితుడుగా మరణించా ..అది చాలు అనిపించినది..
ఇది నీ గురించి ...నీతో చేసిన అతితక్కువ కాలం స్నేహం గురించి..
నా హృదయ స్పందన...

ఆ మరణం కల అయినా ...నిజం అయినా ఇదే నా హృదయ నివేదన..
--
శ్రీ కళ్యాణపు
Actual Written Date: సెప్టెంబర్ 7th 2007,4.52Pm.
Pune.

జీవనప్రయానం

వాస్తవ జీవితం నుండి... స్వప్నాల అంచుల వైపు ...
పన్నీటి పర్మిలాలనుండి ...కన్నీటి ధారవైపు ...
నిర్మల హృదయం నుండి...స్వార్ధపు అంచులవైపు ...
ఆనందపు అంచులనుండి ....విషాద చాయలవైపు ...
స్వచ్చమైన స్నేహం నుండి ... కలుషితమైన విమర్శల వైపు ...
నాగరికత జీవనం నుండి...అనాగరిక గమనం వైపు ...
శ్వాస్వతం నుండి ...అశ్వాసతం వైపు ...
ఉమ్మడి జీవితం నుండి ...ఒంటరి జీవితం వైపు ...
స్వర్గం నుండి.. నరకం వైపు ...
ఈ మరమనుషుల జీవనప్రయానం సాగుతుంది..
--
శ్రీ కళ్యాణపు
Actual Written Date: June 3rd 2007,3.55Pm.
Kukatpally.

యాంత్రిక జీవనం

గగనం ఎంత విశాలమైనదో ...
మనిషి హృదయం కూడా అంతే విశాలమైనది.
ఆచరణ సాధ్యం కాని ...ఆలోచనలతో ...
అసూయా ,ద్వేషాలతో..నేను..నాది అనే..స్వార్ధంతో...
విశాల జీవనగమనం నుండి...
పరిదులతో కూడిన ...యాంత్రిక జీవన గమనంలోకి నేట్టబడుతున్నాడు ఈ రోజు..
ఈ యాంత్రిక జీవనం నుండి బయట పడటం సాధ్యమో లేక అసాధ్యమో ఎవరికీ వారు తేల్చుకోవాల్సిన విషయం...
--
శ్రీ కళ్యాణపు
Actual Written Date: June 3rd 2007,3.22Pm.
Kukatpally.

30, జూన్ 2009, మంగళవారం

" మనస్సు సంఘర్షణ "

ఏదో ఒక భావన..
నర నరాల్లో జీర్ణిచుకుపోయిన సంఘర్షణ ..
కన్నులు ఉండి చూడలేక..కాళ్ళు ఉండి కదలలేక ..
నిత్యం సతమతమౌతున్న ఆవేదన...
గుప్పెడంత గుండెల్లోంచి పొంగుతున్న ఆలాపన..
"ధ్యానం" చేస్తే మనస్సు ప్రశాంతం..
కపటాన్ని మరిస్తే అది హృదయ నిర్మలత్వం ...
ఏదో ఒక దిక్కును నిరంతరం చూస్తూ ఉంటే ..అది పరద్యానం..
వ్యక్తిత్వంతో వ్యవహరిస్తే అది హుందాతనం..
చివరకి దాని వాళ్ళ మంచితనం..
నిన్ను నీవు తెలుసుకుని ...నలుగురితో మెలిగావంటే అది స్నేహం..
నటిస్తూ నమ్మించావు అంటే అది ద్రోహం..
కలిసి ఉండి కలతలు సృష్టించావు అంటే ..వ్యతిరేకం అది మానవతా వాదానికి..
అందుకే .
" భావన "
" ఆవేదన "
" ఆలాపన "
ప్రతి జీవికి ఏదో ఒక రీతిగా ఎదురయ్యే..
" మనస్సు సంఘర్షణ "
--
శ్రీ కళ్యాణపు
Actual Written Date: August 18th 1999. 11.55 am.
Hyderabad.

విశ్వ కళావేదిక..

అది పరిచయాల వేదిక..
అంతరంగాల తరంగాలను ..
మృదంగ నాదాలుగా మలచి..
మౌనంగా ఒకరిని ఒకరు తెలుసుకునే ...యుగారంబ వేదిక..
తడబడు మాటలే పాటలుగా మారి..
క్షణ క్షణాన్ని పరవశంగా మారుస్తున్న చిరునవ్వుల వెలుగుల వేదిక..
వయ్యారాల వగలుపొతూ ...మయూరిలా నర్తిస్తూ ..
మది మదిని దోచుకుంటున్న భూమిక..
నవ వసంతాలు ఒక్కసారిగా ఉప్పొంగిన విశ్వ కళావేదిక...
ఎవరు చెప్పినా..ఎలా చెప్పినా..
ఎక్కడ చెప్పినా ...ఎ విదంగా చెప్పినా..
అన్ని భావాలాపనల అద్భుత భాండాగారం..
చిరు ధరహాసాల చిరునామా..
గుండె గుండెను తాకుతూ ..జ్ఞాపకాల అలలకు ...
తెరలేపిన ...పద గీతికల వేదిక..
" మనస్సు"
అవును అది మనస్సు అనే విశ్వ కళావేదిక..

శ్రీ కళ్యాణపు
Actual Written Date: September 09,2007. 12.33 a m.
పూణే.

ఎక్కడ మొదలైన పరిచయం..

అది ఎక్కడ మొదలైన పరిచయం..
మొదట సందిగ్దం ..తరువాత పలకరింపులు..
క్రమంగా సుగందాల చిరునవ్వుల వాన...
ఆకాశంలో కనిపించే..తారల వెలుగులన్నీ..ఒక్కసారిగా భూమిని తాకితే....!!!
ఆ వెలుగుల తారా జల్లులు ...భూమి అంతటా ...కాంతిరేఖల వ్యవసాయం చేస్తున్నట్లుగా ఉన్నది..
నీ స్నేహం కుడా అటువంటిదే..
నీ దరహాసం ముందర ...ఆ తారల మిల మిల మెరుపులు ..
చాలా సూక్ష్మంగా అనిపించాయి..
సప్తవర్ణాల ఇంద్రధనుస్సులో ఏ వర్ణం లోపించినా కూడా ...
అది ఇంద్రధనుస్సు నిజరూపాన్ని కనుమరుగు చేస్తుంది...
ఎలా చెప్పాలి..ప్రతి అణువులో నువ్వే అని...
ఆ అడుగుల సవ్వడులు ...ఆ చిరునవ్వుల చిరుజల్లులు..
ఆ తొలిమాటల మధుర జ్ఞాపకాలు..ఎన్ని అని చెప్పాలి..
ప్రతిది గుర్తుకు వస్తూ ...అంతరంగంలో అనునిత్యం పరిబ్రమిస్తూనే ఉన్నాయి... అని
---
శ్రీ కళ్యాణపు
Actual Written Date: August 29th ,2007. 10.56 pm.
Kukatpally, Hyderabad.

29, జూన్ 2009, సోమవారం

ఒక నేను...

నిన్ను చూసినప్పుడు నన్ను నేను కోల్పోయాను..
నాతో నీవున్నప్పుడు ...ఈ ప్రపంచాన్ని జయించటం అతి చిన్న విషయం అనిపించింది..
నీ మాటలు చూపులు అన్ని మృదు మధురమే ...
స్వతహాగా నేను ఆశావాదిని..
సమస్యల అలలు నాపై విరుచుకు పడుతున్నా... చిరునవ్వుల ఆనకట్టను కట్టి...
అలజడుల కెరటాలపై పోరాటం చేసి ...మునిగిపోతున్న జీవితాన్ని మరల బృందావనం చేయగలిగా..
నమ్మకం, ఆత్మీయత,విశ్వాసం ,ప్రేమలను పెట్టుబడులుగా పెట్టి..
స్నేహ సౌదాన్ని నిర్మించి ...స్నేహ బంధాన్ని ఆత్మ బంధంగా ఇచ్చినా కూడా ...
నన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు హీనంగా మాట్లాడిన కూడా ..
తొణకని వ్యక్తిత్వంతో నిండుగానే ఉన్నాను..
తిరిగి ఎదురు దాడి చేయకపోవటం నా అసమర్ధత మాత్రం కాదు..
"స్నేహమనే అందమైన పూలతోటలో చిరునవ్వుల జల్లులు తప్ప..
విషాద , కన్నీటి వానలు ఉండకూడదు అన్నదే నా సిద్దాతంతం.."
బహుశా ఇదే అవతలివాళ్ళకి నా బలహీనతగా కనిపించవచ్చు...
ఒక్కసారి మోసపోగలం..కాని జీవితమంతా మోసపోలేముకదా...
ఇన్ని జరిగినా కూడా మనసులో ఎక్కడా నిరాశ లేదు..
బహుశా జీవితంపై నాకున్న నమ్మకం కావొచ్చు..
నా ఆశయాలు..సిద్దాంతాలు ..అన్నీ నీతో చెప్పినప్పుడు..నీవన్న చిన్నమాట నా జీవితాన్నే మార్చివేసింది...
నాకు తెలియకుండా నీపై ఏదో తెలియని అభిమానం..మనస్సు లోతుల్లో ఎక్కడో ఆరంబమైనది...
ఇన్నాళ్ళ స్వేఛ్చ ..స్నేహం..అన్నీ ఇక లేవు అని తెలిసినప్పుడు..
మరో సారి నన్ను నేను కోల్పోయాను..
ఆ చిరునవ్వుల " తీయని నేస్తం" ...
మరల కనిపించని ఆ మధుర స్వప్నం..,పరిచయం..
ఇక ఎప్పటికి కనిపించదేమో..లబించదేమో..
కొన్ని పరిచయాలు కొంతకాలమే ఉన్నా..చిరకాలం పిల్ల తెమ్మెరలా ..
మనస్సును తాకుతూ ఉంటాయి..బహుశా " నీ స్నేహం " అటువంటిదే..!!!
శ్రీ కళ్యాణపు
Actual Written Date:August 27th 2007.11.35 pm.
Kukatpally,Hyderabad.

ఒక పరిచయం...

ఒక పరిచయం...
హృదయంతరాల్లోని భావాలను..
మస్తిస్కంలోని ఆలోచన తరంగాలను ...చల్లని పిల్ల తెమ్మెరలా...
విశాల మైదానంలో విరబూసిన...వెండి వెన్నెలలా..
తడబడుతున్న అడుగులను గమ్యస్తానంవైపు కూర్చుతూ ...
స్థిరత్వం , స్థిమితం ,ఆత్మవిశ్వాసం అనే చిన్ని విత్తనాన్ని నాటి..
ఆదర్శవంతమైన ,ఉన్నతమైన విలువలతో కూడిన ..
పారమార్దిక జీవితమనే..గొప్ప వృక్షాన్ని నాలో నిలిపిన...ఆ పరిచయం..
నిశ్వార్దపు స్వేచ్చా స్రవంతిని ఇచ్చిన... ఆ పరిచయం..
దిన ,దిన ప్రవర్ధమానమై..నిత్య నూతనమై ...
నిరంతం నాలో నిలువెల్లా మరొక నేనై నిలిచిన ఆ పరిచయం..
ఎప్పటికీ... అమరమే....విశ్వ వ్యాప్తమే..

శ్రీ కళ్యాణపు
Actual Written Date:August 22nd 2007 ,11.56 Pm.
Kukatpally , Hyderabad.
( To /For someone who are always unforgettable.....)

స్నేహమా.. నీవెక్కడ..

కొంతమంది మనస్సుకు దగ్గరగా వస్తారు..
అంతే త్వరగా వెళ్ళిపోతారు..
వారిలో కొద్దిమంది మాత్రమే...మనస్సు పొరల్లో చెరగని ముద్ర వేస్తారు ..
ఆ పరిచయ పరిమళాలు నూతన శ్వాశని అందిస్తాయి..
క్రొత్త ఆశయాలకు పునాదులు అవుతాయి..
తరాల అంతరాలను చేరిపివేస్తూ ...
జీవన గమనాన్ని,జీవితపు అడుగులను మార్చివేస్తూ ..
ఉత్తుంగ తరంగాలను తీసుకు వస్తూ దిశా నిర్దేశం చేస్తాయి..
అంతటి విలువైన స్నేహం ..పరిచయం ఎప్పటికి అమృతమయమే...
శ్రీ కళ్యాణపు..
Actual Written date: March 31st 2007, 11.55 pm.
Bangalore.

నిస్వార్దమైన స్నేహం

అది ఏ గుండె గూటిలో ఒదిగిన కావ్యమో..యుగాలనాటి యాగాలను స్ఫురణకు తీసుకు వస్తుంది..
ఏ జ్ఞాపక కుసుమాన్ని మీటినా ఎన్నో ఏళ్ల పరిచయ బంధాన్ని సేలయేరులా ప్రవహింప చేస్తుంది ...
కొన్ని పరిచయాలు నిర్మలమైనవి..నిత్యం మదిలో మెదులుతూ ఉంటాయి...
ఆ అనిర్వచనీయమైన స్నేహం నూతన శ్వాశ నిస్తుంది..
గందర్వ గానంలా మనస్సుకి హత్తుకుంటుంది..
చంధన పరిమళాన్ని వెదజల్లుతుంది ...నిస్వార్దమైన స్నేహం...నిత్యం నూతన శ్వాశ నిస్తుంది..

శ్రీ కళ్యాణపు..
Actual Written Date:14.01.2003, 8 PM
Buckinghamshire,UK.

మనస్సు

సింధూరపు తూర్పు తీరంలో వికసించే భావావాలెన్నో..
సెలయేటి గట్టుపైనుండి వచ్చే వేణుగానం ..
చిన్నవాళ్ళకు జోల పాటగా మారి..చల్లని నిద్రని ఇస్తుంది..
యువతి ,యువకులకు ప్రణయగీతంలా ఉంటుంది ...
మధ్య వయస్కులకు కష్టాల కడగండ్లను ప్రారదోలె తొలకరిలా ఉంటుంది...
వృద్దులకు సంసార సాగరంనుండి బంధ విముక్తులను చేసే..గంధర్వ గానంలా ఉంటుంది..
యోగులకి తప:శక్తిని పెంచే అమృత ధారలా ఉంటుంది..
ఇందరిలో ఇన్ని భావాలను పలికించేది.... " మనస్సు"
శ్రీ కళ్యాణపు..
Actual Written Date : 14.03.2003,8.30 PM
Buckinghamshire, UK.

28, జూన్ 2009, ఆదివారం

మా అమ్మకు..

ప్రపంచంలోని గ్రందాలు అన్ని పటించాను...
ఒక అందమైన పదం దొరుకుతుందేమో అని..
ప్రకృతినంతా వెదికాను ...
ఒక సుందరమైన ప్రదేశం కనిపిస్తుందేమో అని..
మందిరాలు,మసీదులు తిరిగాను..చర్చిలతో సహా..
మానసిక ప్రశాంతత లబిస్తుదేమో అని..
అమ్మ అన్న పదమే అమూల్యమైనది అని..
అమ్మ చుట్టూరా ఉన్న ప్రదేశమే సుందరమైనది అని..
అమ్మ ఒడిలో ఉన్న ప్రశాంతత ..మందిరాలు..మసీదులు..చర్చిల్లో లేదని..
ప్రపంచం అంతా తిరిగాక ,వెతికాకే తెలిసింది..
-----
శ్రీ కళ్యాణపు
Actual Written Date: May 14th 1999. 1PM.
Khammam.

తూర్పు

ప్రతి వేకువన అనుకుంటాను ..తూర్పు దిక్కు ఎంత అదృష్టవంతురాలని ..
అవును మరి.. అదృష్టవంతురాలే కదా..
జీవులు ..నిర్జీవులు అనే తేడాలేకుండా..
అన్నిటిపై తన వెలుగును సమానంగా ప్రసరింపజేసే సూర్యబింబాన్ని ..
తన నుదిటిపై ఎర్రటి కుంకుమలా అలంకరించుకున్న తీర్పు అదృష్టవంతురాలే కదా
అందరిని మేల్కొలిపి ..అందమైన ప్రకృతిని అందరు ఆస్వాదించేలా చేస్తుంది..
తుర్పులోన సింధూరం తిమిరాన్ని ప్రారదోలి ..వెలుగుల చైతన్యాన్ని ఇస్తుంది..
ఎన్ని ఒంపుల సింగారాలో.. ఈ వేకువ తూర్పులో..

శ్రీ కళ్యాణపు
Actual Written Date: 13.11.1999 ,1.40 am.
హైదరాబాద్.

జీవితం

గడిచిన జీవితం మధురమే..
ఎన్నో పరిచయాలు...మజిలీలు..
తీపి గుర్తులు కొన్ని...మరచిపోలేని చేదు జ్ఞాపకాలు మరికొన్ని ...
ఆర్ద్రతతో కూడిన ఆవేదన అనంతమే ...
జీవితం ఒక సాగరం అంటారు...కాని జీవితమంతా సాగరంలా ఉంటే పయనించటానికి నావలు ఎక్కడ ఉంటాయి..
దరి చేరుటకు తీరం ఎక్కడ ఉంటుంది..
ప్రతి మనిషి పరిచయస్తుడు అవ్వగలడు..కాని ప్రతి పరిచయం మల్లెపువ్వు అంత స్వచ్చమైనది కాలేదేమో ...
సందేహాలు ఎన్నో ...సమాధానాలు కొన్నే..
నిరాశ లేదు ..నిస్పృహ లేదు..గర్వం అంతకన్నా లేదు..
అనంతమైన ఆలోచనలు అంతకు మించిన ఆవేదనలు..
ప్రంపంచంలోని బాషలను నేర్వ వచ్చు ..కాని మౌన బాషను నేర్వగలమా ..కేవలం గమనించగలం అంతే..
జీవితాన్ని ఆమూలాగ్రం చదివామంటారు కొందరు..
కాని వారు అంతా గమనించిన వారు మాత్రమే..చదవటానికి అది ఎప్పటికి మారని స్థిరమైన గ్రంధం కాదు కదా..జీవితానికి , మౌనానికి బాష లేదు..కులం లేదు..గోత్రం లేదు..జాతి..మతం అంతకన్నా లేదు..
కేవలం మానవత మాత్రమే ఉన్నది...
మనుషులే దాన్ని మలినం చేస్తున్నారు..
జీవితం మనిషికి మాత్రమే ఉండదు...మట్టికి ..మానుకి ..రాయికి ఉంటుంది ...
ఇంకా చెప్పాలి అంటే ప్రతి అణువుకి ఉంటుంది ...
దానికి రూపం లేదు..బావం లేదు.. కాని ఆదర్శం ఉన్నది ...
అందుకే జీవితాన్ని చదివాము అన్నవారంతా ...కేవలం గమనించిన వారు మాత్రమే అని నా భావన ...
అందుకేనేమో గడిచిన జీవితం కొంత కటినమైనది అయినా.. కొన్నిసార్లు మధురంగా అనిపిస్తుంది....
శ్రీ కళ్యాణపు..
Actual Written Date : 08.11.1999,

OU Campus , Hyderabad.

పరిచయం

ప్రతి పరిచయం ఒక సుమధుర జ్ఞాపకమే....
గతాన్ని మీటితే ఎన్నోగుండెచప్పుళ్ళు..
ఎ పరిచయ ప్రమానమో అది ..
హృదయాంతరాల్లో గూడుకట్టుకున్న వాస్తవాన్ని పరిమళం చేసింది..
వెన్నెల్లో పొన్నాయి చెట్టుకి చెప్పిన ఊసులకి జాబిల్లే మౌనసాక్షి..
ఆకాశ హార్మ్యం నుండి ఎదను తాకిన మంచుముత్యాల స్పర్శ ..
ఒక్కసారిగా మనసుపుటల్లోని మౌనరాగాన్ని చీల్చివేసింది ...
యుగాలమద్య ఉన్న అగాదాన్ని ఒక్కసారిగా తరిమివేసింది..
ఆ తీయని " స్నేహం.." ...
శ్రీ కళ్యాణపు
Actual Written Date: 22.08.2002 ,12 am.
Manchester,UK

ఓ తీయని స్నేహమా...

ఓ తీయని స్నేహమా...
ఆకాశపు అంచుల దాకా తీసుకెల్లి...
వెన్నెల కిరణాల సాక్షిగా...
నక్షత్ర మండలం లో ఆత్మీయతా,ఆనురాగాలను పరిచయం చేసి...
అనుక్షణం అంతరంగాలలో..తీయని ఙ్ఞాపకంలా మెదులుతూ...
ఒంటరినై ఉన్నప్పుడు ...
నీ మధుర ఙ్ఞాపకాలను తోడుగా పంపి...
సిరిమల్లెల సాంగత్యంలా విశ్వ వ్యాప్తమై.....
అనువనువునా...నిక్షిప్తమై...
నన్ను నన్నుగా గుర్తించిన ఓ ధివ్య ఫరిమలమా....
ఎప్పటికీ......నాతో ఉండిపో...........
శ్రీనివాస్ కళ్యాణపు.....

27, జూన్ 2009, శనివారం

sweet Remembrance...

అలలా ఎగసి పడుతూ ఎదను మీటుతున్న జ్ఞాపకం ...
ఒంటరిగా ఉన్నవాన్ని బందాలలోకి నెట్టిన జ్ఞాపకం ...
స్పష్టత లేదు... స్వరూపం లేదు..ఏ ఆకారం తెలియని నిరాకారపు జ్ఞాపకం ...
ఆయినా నవనాడుల స్పందనకి ఉవ్వెత్తున ..ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతున్న జ్ఞాపకం...
ఆకలి దప్పులని మాన్పించి ..ఆలోచనా తరంగాలవైపు పయనం చేయిస్తున్న జ్ఞాపకం..
స్థానువైన హృదయానికి స్థానచలం కలిగించిన జ్ఞాపకం...
అంతరంగంలో వేస్తున్న తప్పటడుగుల శబ్దాన్ని ..సిరిమువ్వల సవ్వడులుగా మార్చిన జ్ఞాపకం ...
ఆవసాన దశలో ఉన్న ఆత్మీయతానురాగాలను సుగందలేపనాలతో సుచరితం చేసిన జ్ఞాపకం...
మమతలు మరిచి ..మనిషి మహిషిగా మారుతున్నప్పుడు ..మహోన్నత మానవతారీతులను జ్ఞప్తికి తెచ్చిన జ్ఞాపకం...
పాషాణంగా ఉన్నవానికి పాదచలనం కలిగించిన జ్ఞాపకం ....మనిషిని మనిషిగా చూడటం నేర్పిన జ్ఞాపకం...
ఎప్పటకి చెదరని జ్ఞాపకం ...ఎన్నటికి వీడని జ్ఞాపకం ...
తొలిచూపులో ఎదను తాకిన జ్ఞాపకం...
తుదిశ్వాశవరకు చెరగని జ్ఞాపకం...
రెండు అక్షరాల స్పందనకి ...ప్రతిస్పందనని కలిగించిన జ్ఞాపకం...
......ప్రేమ....
అవును.. అది ప్రేమ అనే తీపి జ్ఞాపకం..
ప్రతి హృదయంలో ...ఏదో ఒకనాడు ఏదో ఒకరీతిగ మెదిలే జ్ఞాపకం...
చిరకాలపు తొలకరి జ్ఞాపకం..
ప్రేమ.."
శ్రీ కళ్యాణపు ..
Actual Written Date: 22.08.2001.