28, జూన్ 2009, ఆదివారం

జీవితం

గడిచిన జీవితం మధురమే..
ఎన్నో పరిచయాలు...మజిలీలు..
తీపి గుర్తులు కొన్ని...మరచిపోలేని చేదు జ్ఞాపకాలు మరికొన్ని ...
ఆర్ద్రతతో కూడిన ఆవేదన అనంతమే ...
జీవితం ఒక సాగరం అంటారు...కాని జీవితమంతా సాగరంలా ఉంటే పయనించటానికి నావలు ఎక్కడ ఉంటాయి..
దరి చేరుటకు తీరం ఎక్కడ ఉంటుంది..
ప్రతి మనిషి పరిచయస్తుడు అవ్వగలడు..కాని ప్రతి పరిచయం మల్లెపువ్వు అంత స్వచ్చమైనది కాలేదేమో ...
సందేహాలు ఎన్నో ...సమాధానాలు కొన్నే..
నిరాశ లేదు ..నిస్పృహ లేదు..గర్వం అంతకన్నా లేదు..
అనంతమైన ఆలోచనలు అంతకు మించిన ఆవేదనలు..
ప్రంపంచంలోని బాషలను నేర్వ వచ్చు ..కాని మౌన బాషను నేర్వగలమా ..కేవలం గమనించగలం అంతే..
జీవితాన్ని ఆమూలాగ్రం చదివామంటారు కొందరు..
కాని వారు అంతా గమనించిన వారు మాత్రమే..చదవటానికి అది ఎప్పటికి మారని స్థిరమైన గ్రంధం కాదు కదా..జీవితానికి , మౌనానికి బాష లేదు..కులం లేదు..గోత్రం లేదు..జాతి..మతం అంతకన్నా లేదు..
కేవలం మానవత మాత్రమే ఉన్నది...
మనుషులే దాన్ని మలినం చేస్తున్నారు..
జీవితం మనిషికి మాత్రమే ఉండదు...మట్టికి ..మానుకి ..రాయికి ఉంటుంది ...
ఇంకా చెప్పాలి అంటే ప్రతి అణువుకి ఉంటుంది ...
దానికి రూపం లేదు..బావం లేదు.. కాని ఆదర్శం ఉన్నది ...
అందుకే జీవితాన్ని చదివాము అన్నవారంతా ...కేవలం గమనించిన వారు మాత్రమే అని నా భావన ...
అందుకేనేమో గడిచిన జీవితం కొంత కటినమైనది అయినా.. కొన్నిసార్లు మధురంగా అనిపిస్తుంది....
శ్రీ కళ్యాణపు..
Actual Written Date : 08.11.1999,

OU Campus , Hyderabad.