29, జూన్ 2009, సోమవారం

ఒక నేను...

నిన్ను చూసినప్పుడు నన్ను నేను కోల్పోయాను..
నాతో నీవున్నప్పుడు ...ఈ ప్రపంచాన్ని జయించటం అతి చిన్న విషయం అనిపించింది..
నీ మాటలు చూపులు అన్ని మృదు మధురమే ...
స్వతహాగా నేను ఆశావాదిని..
సమస్యల అలలు నాపై విరుచుకు పడుతున్నా... చిరునవ్వుల ఆనకట్టను కట్టి...
అలజడుల కెరటాలపై పోరాటం చేసి ...మునిగిపోతున్న జీవితాన్ని మరల బృందావనం చేయగలిగా..
నమ్మకం, ఆత్మీయత,విశ్వాసం ,ప్రేమలను పెట్టుబడులుగా పెట్టి..
స్నేహ సౌదాన్ని నిర్మించి ...స్నేహ బంధాన్ని ఆత్మ బంధంగా ఇచ్చినా కూడా ...
నన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు హీనంగా మాట్లాడిన కూడా ..
తొణకని వ్యక్తిత్వంతో నిండుగానే ఉన్నాను..
తిరిగి ఎదురు దాడి చేయకపోవటం నా అసమర్ధత మాత్రం కాదు..
"స్నేహమనే అందమైన పూలతోటలో చిరునవ్వుల జల్లులు తప్ప..
విషాద , కన్నీటి వానలు ఉండకూడదు అన్నదే నా సిద్దాతంతం.."
బహుశా ఇదే అవతలివాళ్ళకి నా బలహీనతగా కనిపించవచ్చు...
ఒక్కసారి మోసపోగలం..కాని జీవితమంతా మోసపోలేముకదా...
ఇన్ని జరిగినా కూడా మనసులో ఎక్కడా నిరాశ లేదు..
బహుశా జీవితంపై నాకున్న నమ్మకం కావొచ్చు..
నా ఆశయాలు..సిద్దాంతాలు ..అన్నీ నీతో చెప్పినప్పుడు..నీవన్న చిన్నమాట నా జీవితాన్నే మార్చివేసింది...
నాకు తెలియకుండా నీపై ఏదో తెలియని అభిమానం..మనస్సు లోతుల్లో ఎక్కడో ఆరంబమైనది...
ఇన్నాళ్ళ స్వేఛ్చ ..స్నేహం..అన్నీ ఇక లేవు అని తెలిసినప్పుడు..
మరో సారి నన్ను నేను కోల్పోయాను..
ఆ చిరునవ్వుల " తీయని నేస్తం" ...
మరల కనిపించని ఆ మధుర స్వప్నం..,పరిచయం..
ఇక ఎప్పటికి కనిపించదేమో..లబించదేమో..
కొన్ని పరిచయాలు కొంతకాలమే ఉన్నా..చిరకాలం పిల్ల తెమ్మెరలా ..
మనస్సును తాకుతూ ఉంటాయి..బహుశా " నీ స్నేహం " అటువంటిదే..!!!
శ్రీ కళ్యాణపు
Actual Written Date:August 27th 2007.11.35 pm.
Kukatpally,Hyderabad.